RGV: మీరు ఆ పని చేయలేదా.. అతడే మీ చెత్త శత్రువు
ABN, Publish Date - Aug 03 , 2025 | 05:45 PM
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ వివాదం ఉందో అక్కడ నేనున్నా అంటూ ఉండే వర్మ ఈమధ్యకాలంలో చాలా సైలెంట్ అయ్యాడు. అంతకుముందులా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కోర్టులు, కేసులు అని తిరిగాడు. అప్పటి నుంచి కొంచెం ఆచితూచి మాట్లాడుతూ సైలెంట్ గా ఉంటున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రతి పండగకు వర్మ తనదైన రీతిలోప్రజలకు శుభాకాంక్షలు చెప్పుకొస్తాడు.
ఇక నేడు స్నేహితుల దినోత్సవం అన్న విషయం అందరికీ తెల్సిందే. నెటిజన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఉదయం నుంచి స్నేహం యొక్క గొప్పతనం గురించి సోషల్ మీడియాలో చెప్పుకొస్తూనే ఉన్నారు. తాజాగా వర్మ కూడా ఫ్రెండ్షిప్ డే గురించి తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు. అయితే హ్యాపీ అని కాకుండా అన్ హ్యాపీ అని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. సమాజంలో ఇప్పుడున్న స్నేహం ఎలా ఉందొ నిజం చెప్పుకొచ్చాడు వర్మ. స్నేహితులు.. మోసగాళ్లు ఒకటే అని చెప్పుకొస్తూ వరుస పోస్టులు పెట్టుకొచ్చాడు. ' స్నేహితుడు పొడిచినంత వెన్నుపోటు శత్రువులు కూడా పొడవలేరు'
'స్నేహితుడికి సహాయం చేయడంలో సమస్య ఏంటంటే.. మొదటిసారి సహాయం చేసావని రెండోసారి వచ్చినప్పుడు సహాయం చేయకపోతే .. అతడే నీకు అతిపెద్ద చెత్త శత్రువు అవుతాడు'. 'మీ రహస్యాలన్నింటినీ బయటపెట్టే వారు ఎల్లప్పుడూ మీకు అత్యంత సన్నిహితులుగా ఉంటారు'. 'స్నేహితులు మిమ్మల్ని ఆత్మసంతృప్తి చెందిస్తారు మరియు శత్రువులు మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతారు' అంటూ రాసుకొచ్చాడు. చివర్లో హ్యాపీ అన్ ఫ్రెండ్షిప్ డే అంటూ రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పోస్టులు చూసిన నెటిజన్స్.. వర్మ చెప్పింది అక్షరాలా నిజం అని కామెంట్స్ చేస్తున్నారు.
Anasuya Fire: మీ తల్లినో.. చెల్లినో అలా అంటూ ఊరుకుంటారా. అనసూయ ఫైర్
Arjun Chakravarthy: దేవిక ది లవ్ అఫ్ అర్జున్ చక్రవర్తి.. మేకింగ్ వీడియో