SHOWMAN: ఇదెక్కడి.. అరాచకంరా అయ్యా! హీరోగా.. రామ్ గోపాల్ వర్మ
ABN, Publish Date - Dec 05 , 2025 | 02:29 PM
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు హీరోగా నటిస్తున్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 'షోమ్యాన్' మూవీలో వర్మ హీరో కాగా, సుమన్ విలన్ గా నటిస్తున్నారు.
నిజ జీవితంలో 'షో మ్యాన్' (Showman) గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇప్పుడు 'షో మ్యాన్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'మ్యాడ్ మాన్ స్టర్' (Mad Monster) అనేది దానికి ట్యాగ్ లైన్. వర్మ దర్శకత్వంలో 'ఐస్ క్రీమ్ (Ice Cream), ఐస్ క్రీమ్ 2' చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (Thummalapalli Rama Satyanarayana) 'షో మ్యాన్' మూవీ ప్రొడ్యూసర్. ఈ సినిమాతో నూతన్ (Nuthan) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వర్మతో ఉన్న అనుబంధం కారణంగా ఓ కార్పొరేట్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నానని, ఇది తన బ్యానర్ లో తెరకెక్కుతున్న 120వ సినిమా అని రామ సత్యనారాయణ తెలిపారు.
'షో మ్యాన్' సినిమాలో వర్మ హీరోగా నటిస్తుంటే... ప్రతినాయకుడు పాత్రను ప్రముఖ నటుడు సుమన్ పోషిస్తున్నారు. పలు చిత్రాలలో హీరోగా దశాబ్దాల పాటు నటించి, రాణించిన సుమన్... రజనీకాంత్ (Rajinikanth) 'శివాజీ' (Sivaji) మూవీలో విలన్ గా నటించి, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుండి అడపా దడపా ప్రతినాయకుడి పాత్రలనూ ఆయన పోషిస్తున్నారు. అదే పంథాలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ 'షో మ్యాన్ 'లోనూ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో 'షో మ్యాన్' సినిమా రూపుదిద్దుకుంటోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, సంక్రాంతికి ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని, అప్పుడే విడుదల తేదీని ప్రకటిస్తామని రామసత్యనారాయణ తెలిపారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే ను దర్శకుడు నూతన్ సమకూర్చుకున్నారు.
Also Read: Biggboss 9: బిగ్‌బాస్ టైమ్ మారిపోయింది.. ఎందుకంటే..
Also Read: Varanasi: ‘అవతార్-3’తో రాజమౌళి సర్‌ప్రైజ్ ప్లాన్..