Varanasi: ‘అవతార్-3’తో రాజమౌళి సర్‌ప్రైజ్ ప్లాన్..
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:34 PM
రాజమౌళి తన సినిమాలకు చేసే ప్రమోషన్ వేరే లెవెల్‌లో ఉంటుందన్నది అందరికీ తెలిసిందే! ప్రస్తుతం మహేశ్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘వారణాసి’ చిత్రం ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారు.
రాజమౌళి (SS rajamouli) తన సినిమాలకు చేసే ప్రమోషన్ వేరే లెవెల్‌లో ఉంటుందన్నది అందరికీ తెలిసిందే! ప్రస్తుతం మహేశ్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘వారణాసి’ (varanasi) చిత్రం ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. అందుకు ఉదాహరణ ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో చేసిన గ్లింప్స్ ఈవెంట్. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజగా దీనికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఇది ముందు నుంచి అనుకుంటున్నదే. తాజాగా మరోసారి వైరల్ అవుతోంది. ‘అవతార్ 3’ సినిమాలోను ‘వారణాసి’ సర్‌ప్రైజ్ ఉండనున్నట్లు హాలీవుడ్ చెబుతోంది.
‘అవతార్’ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అంటే రాజమౌళికి ఎంత అభిమానమో తెలిసిందే! ఇప్పుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ 3’ (అవతార్- ఫైర్ అండ్ యాష్) సినిమాలో రాజమౌళి ‘వారణాసి’ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 19న ‘అవతార్ 3’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోనే ‘వారణాసి’కి సంబంధించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించే ప్లాన్‌లో జక్కన్న ఉన్నారని హాలీవుడ్ మీడియా ప్రమోట్ చేస్తోంది. ఇదే నిజమైతే గ్లోబల్‌గా ఈ సినిమాకు అదరిపోయే మైలేజ్ వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మహేశ్ రుద్ర పాత్రలో కనిపిస్తారు. ప్రియాంక చోప్రా మందాకిని గా నటిస్తోంది. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.