Ram Charan: ఉపాసన బర్త్ డే.. స్పెషల్ గా విష్ చేసిన చరణ్
ABN, Publish Date - Jul 20 , 2025 | 09:45 PM
టాలీవుడ్ అడోరబుల్ కపుల్ లిస్ట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- ఉపాసన (Upasana) జంట మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Ram Charan: టాలీవుడ్ అడోరబుల్ కపుల్ లిస్ట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- ఉపాసన (Upasana) జంట మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఉపాసన.. కొణిదెల ఇంటి కోడలిగా, అపోలో బాధ్యతలు చూసుకుంటూ.. ఒక బిడ్డకు తల్లిగా ఎంతో సమర్థవంతంగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇక చరణ్- ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా చరణ్.. కొద్దిగా సమయం దొరికినా ఉపాసన ఒడిలో వాలిపోతాడు.
ఇక పదేళ్ల తరువాత చరణ్ - ఉపాసన క్లిన్ కారాకు జన్మినిచ్చారు. అప్పటివరకు ఎన్ని అవమానాలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డారు. కారా జన్మించక మెగా ఫ్యామిలీకి ఎంత కలిసి వచ్చిందో అందరికీ తెల్సిందే. ఇక నేడు ఉపాసన పుట్టినరోజు కావడంతో చరణ్ భార్యకు ఎంతో స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చాడు. ప్రతి ఏడాది ఉపాసన పుట్టినరోజు విదేశాల్లో సెలబ్రేట్ చేసే చరణ్ ఈసారి ఇంటి వద్దనే చాలా సింపుల్ గా జరిపించాడు.
ఇంటివద్ద బెలూన్స్ మధ్యలో ఉపాసన నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఆమె ముందు కారాను ఎత్తుకున్న చరణ్ బెలూన్స్ తో ఆడిస్తూ కనిపించాడు. ఇక ఈ ఫోటోను షేర్ చేస్తూ 'హ్యాపీ బర్త్ డే మోస్ట్ బ్యూటీఫుల్ పర్సన్.. ఉపాసన గాడ్ బ్లెస్స్ యూ' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక అభిమానులు సైతం ఉపాసనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. చరణ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది త్వరలోనే రిలీజ్ కానుంది.
Roshan Meka: ఏడాదిలో 50 కథలు రిజెక్ట్.. నమ్మశక్యంగా లేదే
Mohan Babu: నేను వండుకొనే పాత్రలో మూత్రం పోసింది.. అయినా అందులోనే వండుకొని తిన్నా