Roshan Meka: ఏడాదిలో 50 కథలు రిజెక్ట్.. నమ్మశక్యంగా లేదే

ABN , Publish Date - Jul 20 , 2025 | 09:03 PM

కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినవారు ఒక సినిమా హిట్ అయ్యింది అంటే.. వెంటనే వరుస సినిమా అవకాశాలను అందుకుంటారు. వెంత్ వెంటనే సినిమాలు చేసేస్తూ ఉంటారు. కథలు నచ్చాయని ఓకే చెప్తారు.

Roshan Meka

Roshan Meka: కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినవారు ఒక సినిమా హిట్ అయ్యింది అంటే.. వెంటనే వరుస సినిమా అవకాశాలను అందుకుంటారు. వెంత్ వెంటనే సినిమాలు చేసేస్తూ ఉంటారు. కథలు నచ్చాయని ఓకే చెప్తారు. కానీ, అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడతాయి. అందుకే ఓవర్ నైట్ స్టార్స్ గా మారినవారు చాలామంది ఇంకా మొదటి సినిమా సక్సెస్ అనే చెప్పుకుంటున్నారు. అయితే హీరో శ్రీకాంత్ (Srikanth) తనయుడు రోషన్ (Roshann) అలా కాదు. ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రోషన్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ కు మహిళా అభిమానులు చాలా ఎక్కువ. జనరేషన్ మారేకొద్దీ తాను కూడా హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్స్, విలన్ రోల్స్ లో మెప్పిస్తూ వస్తున్నాడు. ఇక తండ్రి పోలికలతో పాటు నటననుకూడా పుణికిపుచ్చుకున్న రోషన్.. నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. టీనేజర్ గా అందులో కనిపించి మెప్పించిన రోషన్.. తండ్రికి భారీ హిట్ ఇచ్చిన పెళ్లి సందడి సినిమానే ఈ జనరేషన్ కు తగ్గట్లు చూపించిన పెళ్లి సందD సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినా రోషన్ లుక్స్ కు, యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి.


ఇక పెళ్లి సందD సినిమా తరువాత రోషన్.. రెండు సినిమాలను ప్రకటించాడు. ఒకటి తెలుగులో ఛాంపియన్ కాగా.. రెండోది మలయాళంలో వృషభ. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక అందరి హీరోల్లా వరుస సినిమాలు చేయకుండా రోషన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక్క ఏడాదిలోనే రోషన్ 50 కథలను రిజెక్ట్ చేశాడని ఒక వార్త వినపడుతుంది. కొడుకు కెరీర్ కోసం శ్రీకాంత్ కూడా చాలా కష్టపడుతున్నాడట. ఇద్దరు కలిసి 50 కథలను వినడం.. కొన్ని నచ్చినా అవి ప్రేక్షకులకు రీచ్ అవుతాయో లేదో అని రిజెక్ట్ చేయడం జరిగిందట.


ఈ వార్త వింటే నమ్మశక్యంగా లేదు కానీ, అలా అన్ని సినిమాలు చేసి పరాజయాలు అందుకోవడం కన్నా.. తొందర పడకుండా మంచి మంచి కథలను ఎంచుకొని కెరీర్ ను బిల్డ్ చేసుకోవడం మంచి విషయమే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి రోషన్.. ఛాంపియన్, వృషభ సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Mohan Babu: నేను వండుకొనే పాత్రలో మూత్రం పోసింది.. అయినా అందులోనే వండుకొని తిన్నా

Naalo Sagam Nuvvuga: నాలో స‌గం నువ్వేగా.. వీడియో సాంగ్

Updated Date - Jul 20 , 2025 | 09:04 PM