సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ram Charan: సీఎంను కలిసిన రామ్ చరణ్.. ఫోటోలు వైరల్

ABN, Publish Date - Aug 31 , 2025 | 09:26 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan) నేడు కర్ణాటక సీఎం సిద్దిరామయ్య (Karnataka Cm Siddaramaiah)ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Peddi

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan) నేడు కర్ణాటక సీఎం సిద్దిరామయ్య (Karnataka Cm Siddaramaiah)ను మర్యాదపూర్వకంగా కలిశారు. మైసూర్ లో పెద్ది (Peddi) షూటింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇక మైసూర్ లో పెద్ది షూటింగ్ జరుగుతుంది అని తెలుసుకున్న సిద్దిరామయ్య.. చరణ్ ను స్వయంగా ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు చరణ్ సీఎంను కలిసి, ఆయనను శాలువాతో సన్మానించారు. అనంతరం సీఎం సిద్దిరామయ్య.. చరణ్ కు పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఇక కొద్దిసేపు వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


గేమ్ ఛేంజర్ తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. వినాయక చవితి రోజునే పెద్ది ఇంట్రడక్షన్ సాంగ్ కోసం మైసూర్ వెళ్లినట్లు చిత్రబృందం అధికారికంగా తెలిపింది.


ఇక ఈ సాంగ్ షూటింగ్ మొదలుపెట్టేలోపు చరణ్ అమ్మమ్మ అల్లు కనకరత్నం మరణించారు. దీంతో షూటింగ్ ను పక్కనపెట్టి హుటాహుటిన చరణ్ హైదరాబాద్ కు చేరుకున్నాడు. అమ్మమ్మ అంత్యక్రియలు అవ్వగానే చరణ్ మళ్లీ తిరిగి మైసూర్ చేరుకున్నాడు.ఇక కర్ణాటకకు వెళ్ళగానే సీఎం సిద్దిరామయ్యను చరణ్ కలిశారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. వచ్చే ఏడాది పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tribanadhari Barbarik: మనస్తాపానికి గురై చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు..

Allu Arjun: ప్రతి ఒక్కరికీ.. ధన్యవాదాలు! అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ నోట్‌

Updated Date - Aug 31 , 2025 | 09:27 PM