Tribanadhari Barbarik: మనస్తాపానికి గురై చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు..
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:48 PM
ఈ మధ్య కాలంలో ఏ సినిమా హిట్ అవుతుంది.. ఏ సినిమా ప్లాప్ అవుతుంది అని చెప్పడం చాలా కష్టంగా మారింది. ఎంతో కష్టపడి మంచి కథను ఎంచుకున్నా.. స్టార్స్ నటించినా.. కొన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు.
Tribanadhari Barbarik: ఈ మధ్య కాలంలో ఏ సినిమా హిట్ అవుతుంది.. ఏ సినిమా ప్లాప్ అవుతుంది అని చెప్పడం చాలా కష్టంగా మారింది. ఎంతో కష్టపడి మంచి కథను ఎంచుకున్నా.. స్టార్స్ నటించినా.. కొన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. సినిమా రిలీజ్ కు ముందు ప్రతి ఒక్కరు తమ సినిమా తోపు అంటూ కాలర్ ఎగరేసి.. ఈ సినిమా కనుక హిట్ అవ్వకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం.. అలా చేస్తాం.. ఇలా చేస్తాం అని చెప్పుకొస్తారు. సినిమా రిజల్ట్ తరువాత పత్తా లేకుండా పోతారు. కానీ, ఒక డైరెక్టర్ మాత్రం నా సినిమా కనుక హిట్ అవ్వకపోతే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా అని శపథం చేశాడు. అలాగే చేశాడు కూడా.. ఆ డైరెక్టర్ ఎవరో కాదు మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa).
కట్టప్ప సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్. సింహ, సత్యం రాజేష్ తదితరులు నటించిన సినిమా త్రిబాణధారి బార్బారిక్. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 29 న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. తాజాగా తన సినిమా రిజల్ట్ పై మోహన్ శ్రీవత్స ఎమోషనల్ అయ్యాడు. అంత మంచి సినిమా తీసినా కూడా ప్రేక్షకులు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదని వాపోయాడు. ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా మోహన్ మాట్లాడుతూ.. ' హలో అండి.. నేను ఇప్పుడే బార్బారిక్ సినిమాకు వెళ్లాను. థియేటర్ లో 10 మంది ఉన్నారు. ఆ పదిమంది దగ్గరకు వెళ్లి సినిమా ఎలా ఉంది అని అడిగాను. వారు సినిమా చాలా బావుంది అని చెప్పారు. నిజం చెప్పండి.. నేను డైరెక్టర్ ను అని అంటే.. సార్ మీరు డైరెక్టరా.. అని హాగ్ చేసుకొని సినిమా చాలా బావుందని చెప్పారు.
సినిమా అంత బావుంటే ఎందుకు 10 మంది ఉన్నారు.. ఆ సినిమా కోసం రెండున్నరేళ్ళు పిచ్చికుక్కలా కష్టపడ్డాను. నా భార్య నేను మనస్తాపానికి గురై ఉన్నాను అని.. ఎక్కడ నేను ఆత్మహత్య చేసుకుంటానో అని సినిమా మధ్యలోనే వచ్చేసింది. మలయాళ సినిమాలు అయితే చూస్తారని చేశాను. నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట అన్నాను. సినిమా కనుక నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని చెప్పా.. అలా అన్నా కూడా ఎవరు రాలేదు. నేను మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోతా. పరభాష కంటెంట్ అయితే తప్ప తెలుగు ఆడియన్స్ చూడడం లేదు. నేను అక్కడ సినిమా తీసి తెలుగోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. సినిమా చూసి బాలేదంటే ఓకే.. కానీ, అసలు సినిమా చూడకుండా బాలేదంటే ఏంచేయాలి. అందుకే నా ఛాలెంజ్ నేనే చేస్తున్నా.. నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా' అంటూ చెప్పుతో కొట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Allu Arjun: ప్రతి ఒక్కరికీ.. ధన్యవాదాలు! అల్లు అర్జున్ ఎమోషనల్ నోట్
Constable: వరుణ్ సందేశ్.. కానిస్టేబుల్ ట్రైలర్