Peddi: పెద్ది మొదటి సింగిల్.. రెహమాన్ అదరగొట్టేశాడన్న చరణ్
ABN, Publish Date - Sep 01 , 2025 | 07:54 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నుంచి వస్తున్న తాజా చిత్రం పెద్ది(Peddi). బుచ్చిబాబు సానా(Buchibabu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు.
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నుంచి వస్తున్న తాజా చిత్రం పెద్ది(Peddi). బుచ్చిబాబు సానా(Buchibabu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుండగా మీర్జాపూర్ ఫేమ్ మున్నా భాయ్ దివ్యేందు శర్మ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇకపోతే పెద్ది వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27 న ప్రేక్షకుల ముందకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నిన్ననే మైసూర్ లో ఒక సాంగ్ షూటింగ్ కోసం చిత్రబృందం మొత్తం కర్ణాటక వెళ్లారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా చరణ్.. పెద్ది ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను అందించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నిర్మాత సతీష్ కిలారు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. మొదటి సింగిల్ ను ఏఆర్ రెహమాన్ అదరగొట్టేశాడని చెప్పుకొచ్చాడు.
'మునుపెన్నడూ లేని విధంగా పెద్దిలోని ఆత్మను మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ పట్టేశాడు. మా మొదటిపాట త్వరలోనే రానుంది. వేచి ఉండండి' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వీరల గా మారింది. ఇక ఈ ఫోటోలో చరణ్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అల్ట్రా స్టైలిష్ పెద్ది అని చెప్పొచ్చు.మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Kannappa: ఎట్టకేలకు ఓటీటీకి వస్తున్న కన్నప్ప
Janhvi Kapoor: తల్లి సినిమా.. రీమేక్‌లో తనయ! ఇదైనా హిట్ తెచ్చేనా