Kannappa: ఎట్టకేలకు ఓటీటీకి వస్తున్న కన్నప్ప

ABN , Publish Date - Sep 01 , 2025 | 07:23 PM

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప (Kannappa).

Kannappa

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప (Kannappa). ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అంచనాల నడుమ 27 న రిలీజ్ అయిన కన్నప్ప పాజిటివ్ టాక్ ను అందుకుంది.


పాజిటివ్ టాక్ ను అందుకున్నా కలక్షన్స్ ను మాత్రం అంతగా రాబట్టలేకపోయింది. అయినా మంచు కుటుంబంలో ఇప్పటివరకు కన్నప్ప తీసుకొచ్చిన రికార్డ్ ను మాత్రం ఎవరూ తీసుకురాలేదు. ఇక ఇవన్నీ పక్కనపెడితే.. దాదాపు కన్నప్ప రిలీజ్ అయ్యి రెండు నెలలు దాటిపోయింది. అయినా కూడా ఇంకా ఓటీటీ బాట పట్టకపోవడంతో ఇక ఈ సినిమా ఓటీటీలో రాదేమో అనుకున్నారు. సినిమా రిలీజ్ కు ముందు విష్ణు.. తమ సినిమా డిజిటల్ రైట్స్ ను ఎవరికి అమ్మలేదని, రిలీజ్ తరువాత తమకు నచ్చిన ధరకు అమ్ముతామని చెప్పుకొచ్చాడు.


ఇక దాదాపు 69 రోజుల తరువాత మంచు విష్ణు కన్నప్ప ఓటీటీ రిలీజ్ కు సిద్దమయ్యింది. సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో కన్నప్ప స్ట్రీమింగ్ కానున్నట్లు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. మరి థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందించలేని కన్నప్ప.. ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Janhvi Kapoor: 'పరం సుందరి' ఆశలు 'పెద్ది'పైనే

Matti Kusthi: రెండో రౌండ్.. మొద‌లు! విష్ణు విశాల్‌.. మ‌ట్టీ కుస్తీ2 స్టార్ట్‌

Updated Date - Sep 01 , 2025 | 07:23 PM