Peddi: రంగస్థలం, ఆర్ఆర్ఆర్ ను మించి పెద్ది.. హైప్ పెంచేసిన చరణ్
ABN, Publish Date - Jul 02 , 2025 | 05:24 PM
గ్లోబల్ సార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game Changer) తరువాత నటిస్తున్న చిత్రం పెద్ది (Peddi).
Peddi: గ్లోబల్ సార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game Changer) తరువాత నటిస్తున్న చిత్రం పెద్ది (Peddi). ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలార నిర్మిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ నటుడు, మీర్జాపూర్ మున్నా భాయ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పెద్ది సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ తెజో భారీ పరాజయాన్ని అందుకున్న చరణ్ .. పెద్దితో ఆ మచ్చను చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా మరోసారి రామ్ చరణ్.. పెద్ది సినిమాపై మరింత అంచనాలను పెంచేశాడు. ఓకే ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ పెద్ది గురించి మాట్లాడుతూ.. 'పెద్ది గ్లింప్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసినదాంట్లో పెద్ది ఒక యూనిక్ స్క్రిప్ట్. బహుశా రంగస్థలం, ఆర్ఆర్ఆర్ కన్నా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఇది నేను మాములుగా అన్ని సినిమాలకు చెప్పను. ఇది మీరు ఖచ్చితంగా రాసిపెట్టుకోండి' అని చెప్పుకొచ్చాడు.
చరణ్ మాటలు ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది. ఒక రూరల్ విలేజ్ కుర్రాడు కథగా పెద్దిని బుచ్చి తెరకెక్కిస్తున్నాడు. రంగస్థలం సినిమా తరువాత అంతటి డీగ్లామర్ రోల్ లో చరణ్ నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.
Prabhas: ఫౌజీ కోసం మిర్చి జై ను తీసుకొచ్చినట్టున్నారే