Prabhas: ఫౌజీ కోసం మిర్చి జై ను తీసుకొచ్చినట్టున్నారే

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:48 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ది రాజాసాబ్ (The rajasaab) షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్.. అది కాకుండా ఫౌజీ (Fauji)ని కూడా పట్టాలెక్కించేశాడు.

Prabhas

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ది రాజాసాబ్ (The rajasaab) షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్.. అది కాకుండా ఫౌజీ (Fauji)ని కూడా పట్టాలెక్కించేశాడు. సీతారామం సినిమాతో ఇండస్ట్రీని మొత్తం తనవైపుకు లాగేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫౌజీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.


ఫౌజీ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. 1940ల నాటి యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడుగా కనిపించబోతున్నాడని టాక్. ఇక హను రాఘవపూడి సినిమాల్లో హీరో లుక్, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. ఇక ఈ సినిమాలో కూడా ప్రభాస్ ను అదే లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సీతారామం సినిమాలో దుల్కర్ ఎలా అయితే ఫార్మల్స్ లో కనిపించాడో.. ఇందులో కూడా డార్లింగ్ ఫార్మల్స్ లో కనిపించబోతున్నాడట.


ఇక తాజాగా ఫౌజీ సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఒక అభిమానితో డార్లింగ్ ఫోటో దిగగా.. అది కాస్తా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో.. గాగుల్స్ పెట్టుకొని డార్లింగ్ ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. ఇక ప్రభాస్ చాలావరకు బరువు తగ్గి.. ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన లుక్ మొత్తం మారిపోయింది. ది రాజాసాబ్ టీజర్ లోనే డార్లింగ్ వింటేజ్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. అయితే అది టీజర్ కాబట్టి ఎడిట్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ , ఇప్పుడు ప్రభాస్ లుక్ ఒరిజినల్ అని చెప్పొచ్చు.


ఆదిపురుష్ సమయంలో ప్రభాస్ లుక్ పై విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ తరువాత డార్లింగ్ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడం, కొద్దిగా రెస్ట్ తీసుకోవడంతో పాటు ఫిజిక్ మీద కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బరువు తగ్గడానికి. ఈ లుక్ తీసుకురావడానికి ప్రభాస్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ లుక్ లో డార్లింగ్ అదిరిపోయాడు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. మిర్చిలో జై గుర్తొస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ కెరీర్ లోనే అంతస్టైలిష్ గా ఇంకెప్పుడు కనిపించలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు డార్లింగ్ లుక్ జైను గుర్తుచేస్తుంది. దీంతో ఫౌజీ కోసం జైను దింపారేంటి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Gopichand 33: మంచి టైటిల్ పట్టిన గోపీచంద్.. వర్కవుట్ అయితే అదే ఆనందం

Updated Date - Jul 02 , 2025 | 04:48 PM