Rajinikanth: రజినీ నోట.. బాలయ్య డైలాగ్.. అదిరిపోయిందంతే
ABN , Publish Date - Aug 30 , 2025 | 08:10 PM
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నందమూరి బాలకృష్ణకు చోటు దక్కిన విషయం తెలిసిందే.
Rajinikanth: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నందమూరి బాలకృష్ణకు చోటు దక్కిన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్న హీరోగా బాలయ్య రేర్ రికార్డ్ను క్రియేట్ చేశారు. ఇక తాజాగా బాలయ్యకు సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్ ను అందజేశారు. అంతేకాకుండా ఇండస్ట్రీలోని స్టార్స్ .. బాలయ్యకు కంగ్రాట్స్ చెప్పిన వీడియోలను వేడుకలో చూపించారు. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్.. బాలయ్య గురించి మాట్లాడుతూ.. ఆయన డైలాగ్స్ కూడా చెప్పుకొచ్చారు.
రజినీకాంత్ మాట్లాడుతూ.. ' అందరికీ నమస్కారం.. ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు. కత్తితో కాదురా కంటిచూపుతో చంపేస్తా. ఇలాంటి డైలాగ్స్ బాలయ్య చెప్తేనే బావుంటుంది. నేను చెప్తే బాగోదు. బాలయ్య అంటే పాజిటివిటీ. నెగిటివిటీ ఆయనలో కొంచెం కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే.. వేరే ఎవ్వరూ లేరు. బాలయ్య గారి సినిమా ఆడుతుంది అంటే ఆయన అభిమానులే కాదు.. అందరి ఆర్టిస్టుల అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దానికి నా అభినందనలు. బాలయ్య ఇంకా ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తూ.. పాజిటివిటీ పంచుతూ 75 ఏళ్లు పూర్తి చేసుకోవాలని సంతోషంగా కోరుకుంటున్నాను.. ఐ లవ్ యూ బాలయ్య' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Naga Vamsi: పడిన చోటే లేచాడయ్యా.. అది నాగవంశీ అంటే
Little Hearts Trailer: చదువురాని జంట మధ్య ప్రేమ.. ట్రైలర్ మొత్తం నవ్వులే