Little Hearts Trailer: చదువురాని జంట మధ్య ప్రేమ.. ట్రైలర్ మొత్తం నవ్వులే

ABN , Publish Date - Aug 30 , 2025 | 05:24 PM

సోషల్ మీడియా స్టార్ మౌళి(Mouli).. చిన్న చిన్న కామెడీ వీడియోలు చేసుకుంటూ #90s సిరీస్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

Little Hearts

Little Hearts Trailer: సోషల్ మీడియా స్టార్ మౌళి(Mouli).. చిన్న చిన్న కామెడీ వీడియోలు చేసుకుంటూ #90s సిరీస్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సిరీస్ తరువాత మౌళి హీరోగా నటిస్తున్న చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts). సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆదిత్య హాసన్ నిర్మిస్తున్నాడు. #90s సిరీస్ కు ఈయనే దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో మౌళి సరసన శివాని నగారం హీరోయిన్ గా నటిస్తుండగా.. చైల్డ్ ఆర్టిస్ట్ నిఖిల్ హీరో ఫ్రెండ్ గా నటించాడు.

ఇప్పటికే లిటిల్ హార్ట్స్ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం వనవ్వులు పూయిస్తుంది. ఇద్దరు చదువు రాని స్టూడెంట్స్ మధ్య జరిగిన ప్రేమకథనే లిటిల్ హార్ట్స్. సైనికపురిలో తల్లిదండ్రులతో కలిసి ఉండే కుర్రాడు అఖిల్. చదువు తప్ప మనోడికి అన్ని ఇంట్రెస్టే. ఎప్పుడు తండ్రి చేత తిట్లు తింటూ ఏదో విధంగా కాలేజ్ ఫినిష్ చేయాలనీ చూస్తూ ఉంటాడు. ఇక ఇంకోపక్క వాయుపురిలో పేరెంట్స్ తో నివసిస్తున్న అమ్మాయి కాత్యాయిని. ఈ భామకు చిన్నప్పటి నుంచి చదువు రాదు. సోకుల మీద ఎక్కువ శ్రద్ద పెడుతుంది. వీరిద్దరూ.. ఒక ట్యూషన్ సెంటర్ లో కలుస్తారు. ఇద్దరు చదువురాని వాళ్లే కాబట్టి వెంటనే కనెక్ట్ అవుతారు. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరి కుటుంబంలో తెలుస్తోంది. ఆ తరువాత ఏమైంది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా మొత్తం కామెడీతో నింపేశారు. #90s లో మౌళి సైలెంట్ గా కనిపించినా ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. తన కామెడీ పంచ్ లతో ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించాడు. మౌళి, శివాని జంట చూడడానికి చాలా బావుంది. ట్రైలర్ ని బట్టి సినిమా అంతా వీరి కెమిస్ట్రీ చాలా క్యూట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సింజిత్ ఎర్రమిల్లి మ్యూజిక్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో మౌళి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Akkineni Nagarjuna: నిరాశలో అక్కినేని ఫ్యాన్స్.. నాగ్ ఇలా చేస్తాడనుకోలేదు

Priyanka Chopra: 'ఎస్‌ఎస్‌ఎంబీ 29'.. ప్రియాంక ఏం చేస్తుందంటే..

Updated Date - Aug 30 , 2025 | 06:05 PM