Naga Vamsi: పడిన చోటే లేచాడయ్యా.. అది నాగవంశీ అంటే

ABN , Publish Date - Aug 30 , 2025 | 07:39 PM

ఇండస్ట్రీ.. ఒక మాయాజాలం. ఇక్కడ ఒకసారి హిట్ వస్తే.. మరొకసారి ప్లాప్ వస్తుంది. ఎవరు హీరో అవుతారో.. ఎవరు జీరో అవుతారో చెప్పడం కష్టం.

Naga Vamsi

Naga Vamsi: ఇండస్ట్రీ.. ఒక మాయాజాలం. ఇక్కడ ఒకసారి హిట్ వస్తే.. మరొకసారి ప్లాప్ వస్తుంది. ఎవరు హీరో అవుతారో.. ఎవరు జీరో అవుతారో చెప్పడం కష్టం. అది కేవలం నటీనటులకే వరిస్తుంది అనుకుంటే పొరపాటే. డైరెక్టర్లు, నిర్మాతలు కూడా అలాంటి పరిస్థితిలు ఎదుర్కొన్నవారే. అందులో ఒకరు సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi). సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై హిట్ సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకేమైనా గుర్తింపును తెచ్చుకున్నాడు. అసలు ప్రమోషన్స్ ను నిర్మాత రావడం అనేది నాగవంశీ దగ్గరనుంచే మొదలయ్యిందని చెప్పొచ్చు.


నాగవంశీ ఏది మనసులో దాచుకోడు. అక్కడ మాట.. ఇక్కడ మాట అనేది ఏది ఉండదు. నిర్మొహమాటంగా ఏది అనిపిస్తే అది చెప్పేస్తాడు. అది కొన్నిసార్లు విమర్శలు తీసుకొచ్చినా కూడా ఆ ముక్కుసూటితనాన్ని మాత్రం వదులుకోడు. ఇక ఈ ఏడాదిలో సితార హిట్స్ తక్కువ.. పరాజయాలను ఎక్కువ అందుకుంది. ముఖ్యంగా నాగవంశీని ముంచేసింది వార్ 2. తెలుగు రైట్స్ ను నాగవంశీ ఎంతో భారీ ధరకు కొనుగోలు చేశాడు. డబ్బింగ్ సినిమాకు అంత అవసరం లేదు అని చెప్తున్నా.. ఎన్టీఆర్ మీద నమ్మకంతో నాగవంశీ వార్ 2 ను కొన్నాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా నాగవంశీ చాలా నష్టపోయాడు.


సరే వార్ 2 నుంచి కోలుకోవడానికి కింగ్డమ్ ఉందిగా.. అది అయినా తనను గట్టెక్కిస్తుంది అనుకుంటే.. అది మరింత కూరుకుపోయేలా చేసింది. దెబ్బ మీద దెబ్బ.. వేరేవాళ్లు అయితే కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. కానీ, అక్కడున్నది నాగవంశీ. ఎన్ని విమర్శలు వచ్చినా.. సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోయాడు అన్నా.. సినిమా వాయిదా వేశాడు అని ట్రోల్ చేసినా.. చెక్కు చెదరని నవ్వుతో గట్టి కౌంటర్ వేసి.. ట్రోలర్స్ కు షాక్ ఇచ్చాడు. అంతేనా.. పడిన చోటే నిలబడాలని.. డబ్బింగ్ సినిమాతో పోగొట్టుకున్న పేరు, లాభాలు.. అదే డబ్బింగ్ సినిమాతో రాబట్టుకోవాలని ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు.


మలయాళ డబ్బింగ్ సినిమా లోక తెలుగు రిలీజ్ హక్కులను నాగవంశీ సొంతం చేసుకొని తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రిలీజ్ చేశాడు. మలయాళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా తెలుగులో కొత్త లోక పేరుతో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. సెప్టెంబర్ 5 వరకు పెద్ద సినిమాలు లేవు. అప్పటివరకు కొత్త లోక థియేటర్ లో ఉంటుంది. ఇక కలక్షన్స్ కూడా ఓ రేంజ్ లోనే వస్తున్నట్లు తెలుస్తోంది. అలా నాగవంశీ కొత్త లోకతో గట్టెక్కాడు. ఇక దీంతో.. పడిన చోటే లేచాడయ్యా.. అది నాగవంశీ అంటే అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇది కాకుండా నాగవంశీ లిస్ట్ లో మాస్ జాతర ఒకటి ఉంది. అది కూడా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి నాగవంశీ డబ్బింగ్ సినిమాలతో కాకుండా తెలుగు సినిమాతో హిట్ ఎప్పుడు కొడతాడో చూడాలి.

Jamuna: అభినయ సత్యభామ... జమున

Kangana Ranaut: రెండు ప్రాజెక్ట్స్ తో రానున్న పొలిటికల్ బ్యూటీ

Updated Date - Aug 30 , 2025 | 07:43 PM