Bobby Deol: స్టార్ హీరోయిన్ నోటి నుంచి గబ్బు వాసన.. ముద్దు పెట్టనన్న యానిమల్ విలన్

ABN , Publish Date - Aug 17 , 2025 | 01:09 PM

యానిమల్ (Animal)సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు బాబీ డియోల్(Bobby Deol). ఆ సినిమా తరువాత తెలుగులో డాకు మహారాజ్, హరిహర వీరమల్లు లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.

Bobby Deol

Bobby Deol: యానిమల్ (Animal)సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు బాబీ డియోల్(Bobby Deol). ఆ సినిమా తరువాత తెలుగులో డాకు మహారాజ్, హరిహర వీరమల్లు లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన బాబీ డియోల్ ఒకప్పుడు స్టార్ హీరోగా సత్తా చాటినవాడే. అయితే ఒక సినిమాలో హీరోయిన్ నోటి నుంచి గబ్బు వాసన రావడం వలన బాబీ డియోల్ ముద్దు పెట్టనని డైరెక్టర్ కు నిర్మొహమాటంగా చెప్పేశాడట. ఈ విషయాన్నీ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకల్లో అందరి ముందు చెప్పుకొచ్చాడు. ఇది పాత విషయమే అయినా ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ? ఆ సినిమా ఏంటి .. ? అనేది తెలుసుకుందాం.


బాబీ డియోల్, మనీషా కొయిరాలా, కాజోల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం గుప్త్ : ది హిడెన్ ట్రూత్. 1997 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమాలో బాబీ డియోల్, మనీషా కొయిరాలా మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ చేసేటప్పుడు బాబీ డియోల్ ఇబ్బంది పడినట్లు 2001 లో జరిగిన ఫిలింఫేర్ అవార్డు వేదికపై చెప్పుకురావడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. మనీషా నోటి నుంచి గబ్బు వాసన వచ్చేదని, అది తట్టుకోలేక ఆమెతో ముద్దు సీన్స్ చేయనని డైరెక్టర్ తో చెప్పినట్లు చెప్పుకొచ్చాడు.


' మనీషాతో కలిసి రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు ఆమె నా బుగ్గ కొరకాలి. అప్పుడే మనీషా శనగలకూరతో పాటు ఉల్లిపాయ వేసుకొని భోజనం చేసింది. దాంతో ఆమె నోటి నుంచి ఉల్లి వాసన దారుణంగా వస్తుంది. ఆ విషయం ఆమెకు తెలిస్తే సరిచేసుకుంటుందని నేను, ఫైట్ మాస్టర్ కలిసి ఒక ప్లాన్ వేసాం. ఆ సీన్ లో మనీషాకు అన్నగా ఒక కొత్తకుర్రాడు నటించాడు. అతడితో మేము ఉల్లిపాయలు తినిపించాం. యాక్టింగ్ బాగా వస్తుందని, ఏకాగ్రత పెరుగుతుందని చెప్పేసరికి అతడు కూడా బాగా తిన్నాడు. ఆ తరువాత మనీషా ముందు డైలాగ్స్ చెప్పించాం. అప్పుడైనా ఆమె నోటి నుంచి వచ్చే ఉల్లిపాయ వాసన ఆమెకు అర్థమవుతుందని అనుకున్నాం. కానీ, మా ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఆమె ఆ వాసనను చాలా లైట్ తీసుకుంది. ఇక దీంతో ఆ వాసన భరించలేక.. ఆమెతో ముద్దు సీన్ చేయను అని డైరెక్టర్ కు చెప్పేశాను' అని చెప్పుకొచ్చాడు.ఇక ఫన్నీ గా చెప్పడంతో అక్కడ ఉన్నవారందరూ పగలబడి నవ్వారు.

కుక్కల బెడద నివారణకు వర్మ మార్క్ సొల్యూషన్స్...

Vijaya Ramaraju: విడుదలైన 'అర్జున్ చక్రవర్తి' టైటిల్ సాంగ్

Updated Date - Aug 17 , 2025 | 01:09 PM