PuriSethupathi: బెగ్గర్ పోయింది.. స్లమ్ డాగ్ వచ్చింది
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:48 PM
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
PuriSethupathi: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి నుంచి మొన్నీ మధ్య వచ్చిన డబుల్ ఇస్మార్ట్ వరకు పూరి మార్క్ కచ్చితంగా ఉంటుంది. విజయాపజయాలను పక్కన పెడితే.. పూరి స్టోరీస్, తీసే విధానము చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత పూరి కోలుకోవడం చాలా కష్టం అనే చెప్పొచ్చు. కానీ, అసాధ్యం అని చెప్పలేం. డబుల్ ఇస్మార్ట్ ఆశించిన ఫలితాన్ని అందుకున్నా కూడా పూరి.. తన కథతో హిట్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాడు.
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పూరి సేతుపతి. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మీ - పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్, టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే గత కొంతకాలంగా పూరిసేతుపతి సినిమాకు చాలా టైటిల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ వచ్చాయి. మొదట మాలిక్ అన్నారు. ఆ తరువాత బెగ్గర్ అన్నారు.. ఆ తరువాత భవతీ భిక్షందేహి అన్నారు. కానీ, ఇందులో ఏది ఫైనల్ అవుతుంది అనే విషయం ఎవరికి తెలియలేదు.
తాజాగా పూరిసేతుపతి టైటిల్ ఫైనల్ అయ్యినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చిన ఏ పేర్లు కాకుండా కొత్తగా స్లమ్ డాగ్ అనే పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. మొదటినుంచి పూరి అన్ని భాషల్లో.. అందరికీ అర్ధమయ్యే టైటిల్ ను ఎంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరికి స్లమ్ డాగ్ అనేది అనేది అన్ని భాషల్లో అర్ధం కావడంతో ఈ టైటిల్ నే ఫిక్స్ చేశారట. ఇక రేపు ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో పూరి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Suhas: రెండోసారి తండ్రి అయిన కలర్ ఫోటో హీరో..
Hollywood: రిపీట్ రన్స్ తో ఆదాయం పొందుతున్న నటీనటులు