Suhas: రెండోసారి తండ్రి అయిన కలర్ ఫోటో హీరో..
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:42 PM
కుర్ర హీరో సుహాస్ (Suhas) అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. తాను రెండోసారి తండ్రి అయ్యినట్లు చెప్పుకొచ్చాడు
Suhas: కుర్ర హీరో సుహాస్ (Suhas) అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. తాను రెండోసారి తండ్రి అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. రెండోసారి కూడా మగబిడ్డనే జన్మించినట్లు తెలుపుతూ తన భార్యతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు సుహాస్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సుహాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు.
కలర్ ఫోటో సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మరీనా సుహాస్ ఆ తరువాత మంచి మంచి సినిమాల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చిన ఓ భామ అయ్యో రామ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. కానీ, ఓజీలో ఒక చిన్న క్యామియో లో కనిపించి సుహాస్ అరిపించాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో సుహాస్ బిజీగా ఉన్నాడు.
ఇక సుహాస్ భార్య పేరు లలిత. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళింట్లో ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నారట. వీరిద్దరికీ గతేడాదిలోనే ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు కూడా బాబునే పుట్టాడు. ఇద్దరు కాస్తా నలుగురు అయ్యి సంపూర్ణ కుటుంబంగా మారారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
OG 2: సుజీత్ ప్లాన్ అంతా అదేనా.. స్టోరీ లైన్ సిద్ధమేనా..
Kattappa: ‘కట్టప్ప’ ఎవరు.. విజయేంద్రప్రసాద్ కొత్త కథ