Puri Jagannadh: పూరి జగన్నాథ్  వదిలిన ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్  

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:23 PM

శ్రీరామ్ నిమ్మల, హర్షిత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’.  అందమైన గ్రామీణ ప్రేమ కథాతో  తెరకెక్కించిన ఈ సినిమాకి  రాము.ఎం నిర్మాత.

శ్రీరామ్ నిమ్మల (Sriram Nimmala), హర్షిత (harshita)జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’ (Ento Antha Sarikothaga).  అందమైన గ్రామీణ ప్రేమ కథాతో  తెరకెక్కించిన ఈ సినిమాకి  రాము.ఎం నిర్మాత. రాజ్ బోను దర్శకుడు.  ఈ  మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  విడుదల చేశారు, ‘ఏంటో అంతా సరికొత్తగా’ టైటిల్‌ బావుందని, పోస్టర్ చూస్తే  బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉన్నట్లు అనిపిస్తుందని అయన అన్నారు. (Puri Jaganath)

Puri-2.jpg

దర్శకుడు మాట్లాడుతూ ' యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్రామీణ వాతావరణంలో అందమైన ప్రేమ కథా చిత్రాలు వచ్చి చాలా రోజులు అవుతోంది. అందుకే ఈ జానర్ ఎంచుకున్నాం. ఇందులో హీరో, అతని స్నేహితులు టోల్ గేట్ వద్ద పని చేస్తుంటారు. గ్రామీణ వాతావరణం, టోల్ గేట్ వద్ద జరిగే సంఘటనలు చూపిస్తూ అందమైన ప్రేమను తెరపై ఆవిష్కరించబోతున్నాం.  అన్ని  రకాల అంశాలను జోడించి ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ‘ఏంటో అంతా సరికొత్తగా’ మూవీని రూపొందించారు. త్వరలోనే ఇతర కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నాము' అని అన్నారు. 

ALSO READ: Rashmika And Vijay: రీల్‌ లవ్‌ కాదు.. రియల్‌ లవ్‌ వేదికపైకి రాబోతుంది..

Mass Jathara Review: రవితేజ.. మాస్ జాతర మూవీ రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?

Updated Date - Nov 01 , 2025 | 03:27 PM