TG Viswa Prasad: అరుణాచలంలో రజినీకాంత్ ని కాదు..
ABN, Publish Date - Sep 13 , 2025 | 05:04 PM
సక్సెస్ అంటే స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ కాదు వెంటనే రావడానికి.. దానికోసం ఎంతో పట్టుదల, కృషి అన్నింటికీ మించి ఓర్పు ఉండాలి.
TG Viswa Prasad: సక్సెస్ అంటే స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ కాదు వెంటనే రావడానికి.. దానికోసం ఎంతో పట్టుదల, కృషి అన్నింటికీ మించి ఓర్పు ఉండాలి. ఒక బిజినెస్ మ్యాన్ గా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఓర్పు కచ్చితంగా ఉండాలి. ఎన్ని అవమానాలు, అడ్డంకులు వచ్చినా ఎదుర్కోవాలి. అవన్నీ ఎదుర్కొని ఇన్నాళ్లకు ఆ సక్సెస్ ను అందుకున్నాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే వస్తున్నాడు. పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు తీసినా విజయం మాత్రం దక్కలేదు. చివరకు మిరాయ్ తో ఆ విజయాన్ని అందుకున్నాడు విశ్వప్రసాద్.
ఇక మిరాయ్ సక్సెస్ మీట్ లో టీజీ విశ్వప్రసాద్ ఇన్నాళ్లు పడిన బాధను మొత్తం వెళ్లగక్కాడు. చురకలు పెట్టాల్సిన వాళ్లకు గట్టిగా పెట్టాడు. ట్రోల్స్ కు సమాధానం చెప్పాడు. పీపుల్ మీడియా నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్లాప్ అవుతుంటే.. సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్ వేశారు. డబ్బు ఎక్కువ అయ్యి.. అరుణాచలంలో రజినీకాంత్ లా డబ్బులు ఖర్చుపెట్టడానికి మాత్రమే సినిమాలు తీస్తున్నాడని మీమ్స్ వేశారు. ఇన్నాళ్లు ఈ మీమ్స్ పై నోరుమెదపని టీజీ విశ్వప్రసాద్.. ఇప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
' కార్తీక్ చూపించిన కొన్ని సీన్స్ చూసి నేను ఈ సినిమాను ఒప్పుకున్నాను. నాకు అంత పెద్ద నాలెడ్జ్ ఏమి లేదు. కానీ, అప్పుడు తీసుకున్న నా డెసిషన్ నా జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్. ఆ తరువాత నా ప్రయాణంలో ట్రోల్స్ ఉన్నాయి, ఛాలెంజ్స్ ఉన్నాయి. అరుణాచలం సినిమాలో రజినీకాంత్ లా డబ్బులు ఖర్చుపెట్టాలి అంటే ఇలా అని రీల్స్ కూడా చేశారు. అలా కాదండి. 2 వేల ఇంటర్న్షిప్ తో నా కెరీర్ ను మొదలుపెట్టాను. 2 వేల డాలర్లతో అమెరికాలో నా కెరీర్ మొదలుపెట్టి ఇక్కడకు వచ్చాను. ఫ్రీ మనీ నాకు ఎక్కడా దొరకలేదు. నేను డబ్బుకు విలువ ఇస్తాను.. డబ్బు ఎలా ఖర్చుపెట్టాలో కూడా నాకు తెలుసు' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Nabha Natesh: తడిసిన అందాలను ఆరబోసి కవ్విస్తున్ననభా..
NBK 111: హిస్టారికల్ కథకు భారీ యాక్షన్‌ను జోడించి..