NBK 111: హిస్టారికల్ కథకు భారీ యాక్షన్‌ను జోడించి.. 

ABN , Publish Date - Sep 13 , 2025 | 04:09 PM

బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్లో  వచ్చిన  ‘వీరసింహారెడ్డి’ విజయవంతంగా ఆడింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతోంది.

NBK 111

బాలకృష్ణ(Bala Krishna), దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్లో  వచ్చిన  ‘వీరసింహారెడ్డి’ విజయవంతంగా ఆడింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతోంది. ‘ఎన్‌బీకే 111’ (NBK 111) వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని వెంకట సతీశ్‌ కిలారు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్  పనుల్లో ఉన్న ఈ సినిమాని దసరా పండగ సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. హిస్టారికల్ కథకు  భారీ యాక్షన్‌ను జోడించి ఓ వినూత్నమైన ఎపిక్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు..చిత్ర  బృందం ప్రకటన రోజే వెల్లడించింది. 

ఇందులో బాలయ్య మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అఖండ 2 చిత్రంతో బిజీ గా ఉన్నారు. తదుపరి దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడితో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ దశమికి ఈ సినిమాపై కూడా స్పష్టత వచ్చే అవకాశముందని వార్తలొస్తున్నాయి.  

Updated Date - Sep 13 , 2025 | 04:14 PM