సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Natti Kumar: ఫిష్ వెంకట్ కు ఎందుకు సాయం చేయాలి..

ABN, Publish Date - Jul 21 , 2025 | 05:39 PM

నిర్మాత నట్టికుమార్ (Natti Kumar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం జరిగినా దానిపై ఆయన తన గళాన్ని వినిపిస్తాడు. ఆ వివాదంలోని మంచి చెడులను వివరిస్తూ ఉంటాడు.

Natti Kumar

Natti Kumar: నిర్మాత నట్టికుమార్ (Natti Kumar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం జరిగినా దానిపై ఆయన తన గళాన్ని వినిపిస్తాడు. ఆ వివాదంలోని మంచి చెడులను వివరిస్తూ ఉంటాడు. ఈ మధ్యనే కమెడియన్ ఫిష్ వెంకట్ (Fish Venkat) మృతి చెందిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా రెదను కిడ్నీలు ఫెయిల్ అయ్యి.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం గత నెలలో పూర్తిగా క్షీణించింది. డయాలసిస్ చేస్తూ వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని, తమకు ఇండస్ట్రీ నుంచి ఆర్థిక సాయం కావాలని ఫిష్ వెంకట్ కుమార్తె, భార్య ఒక వీడియో ద్వారా తెలిపారు.


ఆ తరువాత కొందరు స్టార్ హీరోలు.. ఫిష్ వెంకట్ కు సాయం చేశారని వార్తలు వచ్చాయి. కానీ, అదంతా ఫేక్ అని, ఇండస్ట్రీ నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమించి మరణించాడు.ఇక ఆయన మరణానికి ఇండస్ట్రీనే అని, ఒక్కరు కూడా సహాయం చేయడానికి రాలేదని నెటిజన్స్.. సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తాజాగా నిర్మాత నట్టికుమార్ ఈ వివాదంపై స్పందించాడు. ఫిష్ వెంకట్ కు ఎవరైనా ఎందుకు సహాయం చేయాలి అని ప్రశ్నించాడు.


' సినిమా .. ఒక బిజీ ప్రపంచం. ఇక్కడ ఎవరికీ ఖాళీ ఉండదు. పరిశ్రమతో సంబంధాలు కొనసాగించేవారికి అయితే సెలబ్రిటీలు వెళ్ళి చూస్తారు. ఫిష్ వెంకట్ కి ఇండస్ట్రీకి సంబంధాలు లేవు. ఆయన కొన్నేళ్ల క్రితమే ఇండస్ట్రీకి దూరమయ్యాడు. కనీసం మా సభ్యత్వం కూడా తీసుకోలేదు. ఇండస్ట్రీలో ఉన్నవారికి ఎవరు మరణించారు అని తెలుసుకొనేంత సమయం ఎవరికి లేదు. ఇది కేవలం ఫిష్ వెంకట్ విషయంలోనే కాదు. రేపు నా విషయం లో కూడా ఇదే జరుగుతుంది. సోషల్ మీడియా, ఫిల్మ్ ఛాంబర్ తో సన్నిహితంగా ఉన్నవారికి ఏదైనా జరిగితే అందరూ వెళ్తారు.


ఫిష్ వెంకట్.. గబ్బర్ సింగ్ గ్యాంగ్ తో ఎక్కువ టచ్ లో ఉన్నాడు. వారు మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నారు. వారు కాకుండా మిగిలినవారు అయ్యో పాపం అని కూడా అనరు. చాలామంది వెంకట్ కు ఎవరూ హెల్ప్ చేయలేదు.. పలకరించలేదు అని అన్నారు. అది అందరికీ బాధను కలిగించి ఉండొచ్చి. కానీ, ఆయన ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నా మా సభ్యత్వం తీసుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఒకరు సాయం చేస్తారని ఎవరూ ఆశించకండి. ఆరోగ్యం బావున్నప్పుడే జాగ్రత్తగా ఉండండి. డబ్బులు వెనకేసుకోండి. ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురుచూడకండి. ఎవరైనా ఎందుకు సాయం చేయాలి.


ఫిష్ వెంకట్ రోజుకు రూ. 3 వేలు నుంచి రూ. 30 వేలు తీసుకొనే స్థాయికి వెళ్ళాడు. అప్పుడే డబ్బును పొదుపు చేసుకోవాల్సింది. మన దగ్గర డబ్బు లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. ఎవరో సాయం చేస్తారనుకోకూడదు. ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టలేము. ప్రస్తుతం లేనివాడికి ప్రాణం మీద తీపి.. ఉన్నవాడికి డబ్బు మీద తీపి.. ఇలానే ఉన్నారు అందరూ. ఎవరైనా మాట సాయం చేయడానికి ముందుకొస్తారేమో కానీ, ఆర్థిక సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నట్టికుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

HHVM Event: పలు ఆంక్షలతో.. హరి హర వీరమల్లు’ ప్రీరిలీజ్‌ ఈవెంట్

Tollywood: నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారమణితో స్పెషల్ చిట్ చాట్

Updated Date - Jul 21 , 2025 | 05:39 PM