HHVM Event: పలు ఆంక్షలతో.. హరి హర వీరమల్లు’ ప్రీరిలీజ్‌ ఈవెంట్

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:48 PM

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)ప్రధాన పాత్ర పోషించిన చిత్రం  ‘హరిహర వీరమల్లు’. ఈ నెల 24న విడుదల కానున్న  ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైద్రాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది

Harihara veeramallu - Pawan Kalyan

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)ప్రధాన పాత్ర పోషించిన చిత్రం  ‘హరిహర వీరమల్లు’. ఈ నెల 24న విడుదల కానున్న  ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైద్రాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది. దీనికి  హైదరాబాద్‌ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ సినిమాటోగ్రఫ్రీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్, తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హాజరవుతున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, రాజమౌళి ఈ కార్యక్రమానికి రానున్నారని తెలుస్తుంది. 

అయితే, ఈవెంట్ నిర్వహణకు సంబంధించి పోలీసులు పలు ఆంక్షలు విధించారు.  1000-1500 మందిని మాత్రమే ఈవెంట్‌కు అనుమతించాలని పోలీసులు సూచించారు. పార్కింగ్, క్రౌడ్ కంట్రోల్ బాధ్యత పూర్తిగా నిర్మాతే చూసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈవెంట్ సజావుగా సాగడానికి 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.పవన్‌కల్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘హరి హర వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నాయి. 

Updated Date - Jul 21 , 2025 | 05:00 PM