Naga Vamsi: రివ్యూయర్స్ ను విష్ణు షేక్ ఆడించేశాడు.. ఎంతగా భయపెట్టాడంటే
ABN , Publish Date - Jul 21 , 2025 | 02:22 PM
టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒకటి. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) చూసుకుంటున్న విషయం తెల్సిందే.
Naga Vamsi: టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒకటి. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) చూసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా అయినా కానీ, ఆ ప్రమోషన్స్ లో కచ్చితంగా నాగ వంశీ ఉండాల్సిందే. అసలు ఒక సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత పాల్గొనాలి అనే ట్రెండ్ ను ప్రవేశపెట్టిందే నాగ వంశీ. సినిమా గురించి, ఇండస్ట్రీ గురించి నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా చెప్తూ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం నాగ వంశీకి ఉన్న అలవాటు.
ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్యదేవర నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
ఈ మధ్యకాలంలో ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే పబ్లిక్ టాక్ అనేది చాలా ముఖ్యం. మొదటి షో చూడగానే రివ్యూయర్స్ సినిమా హిట్టా.. ఫట్టా అని చెప్పేస్తున్నారు. ఇలాంటివాటికి సపరేట్ యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఉన్నాయి. అందులో సినిమా మొత్తాన్ని క్లుప్తంగా వివరించి, రేటింగ్ ఇచ్చి.. చూడొచ్చా.. చూడకూడదా.. ? అనేది తేల్చి చెప్పేస్తారు. ఇక చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇలాంటి రివ్యూయర్స్ ఇచ్చిన నెగిటివ్ రివ్యూల వలనే పరాజయాలను అందుకున్నాయి.
తాజాగా ఈ రివ్యూయర్స్ గురించి నాగ వంశీ మాట్లాడాడు. మంచు విష్ణు వలన ఇలాంటి హ్యాండిల్స్ చాలా తగ్గాయని నాగ వంశీ చెప్పుకొచ్చాడు. ' మొన్న విష్ణు అన్న ఏం చేశాడో కానీ, తగ్గాయి. వాళ్ళందరి మీద విష్ణు అన్న మాములుగా ఆడలేదు. యూట్యూబ్ లు కానీ, ఇన్స్టాగ్రామ్ లు కానీ.. షేక్ రెండు రోజులు. ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. సినిమా పేరు కూడా ఎత్తలేదు. అంత భయపెట్టాడు. కొన్ని హ్యాండిల్స్ ఫలానా సినిమా అని టైటిల్ చెప్పి చెప్పడానికి కూడా భయపడ్డారు. ఆయన ఏదో చేసి కంట్రోల్ చేశాడు. సినిమా నచ్చినవాళ్లు కాదు.. నచ్చనివాళ్లు కూడా చాలా బాలెన్సుడ్ గా.. ఫిల్టర్ చేసి చెప్పారు' అని చెప్పుకొచ్చాడు. కన్నప్పను ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా పడలేదని నాగ వంశీ చెప్పుకొచ్చాడు.
కన్నప్ప సినిమా సమయంలో మంచి విష్ణు.. యూట్యూబర్స్ పై చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కొంతమంది కన్నప్ప పేరు తీయకుండా సినిమా గురించి రివ్యూలు ఇచ్చారు. ఇంకొంతమంది అయితే అసలు రెండు మూడు రోజుల వరకు రివ్యూలు కూడా ఇవ్వలేదు. ఇదే పద్దతి కనుక మిగతా సినిమాలకు కూడా అవలంబిస్తే బావుంటుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి కింగ్డమ్ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Pawan Kalyan: నాకు కలక్షన్స్ రావు.. ఆ హీరోల కన్నా చాలా తక్కువ నేను
Anushka Shetty: నటిగా సూపర్ అనిపించుకుని ఇరవై యేళ్ళు...