Pawan Kalyan: నాకు కలక్షన్స్ రావు.. ఆ హీరోల కన్నా చాలా తక్కువ నేను
ABN , Publish Date - Jul 21 , 2025 | 01:33 PM
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. అని సాంగ్స్ పాడేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
Pawan Kalyan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. అని సాంగ్స్ పాడేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకు అంత ఆనందం అని అంటారా.. ? మరి ఉండదా ఏంటి.. ఎన్నేళ్ల తరువాత ఒక సినిమా ప్రెస్ మీట్ కు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరయ్యాడు. మీడియా ముందు పవన్ రావడమే అంతంత మాత్రం.. తన సినిమా ప్రెస్ మీట్ కు రావడం అంటే గొప్ప విషయమనే చెప్పాలి. అంతా ఏఎం రత్నం దయ అని చెప్పొచ్చు. ఆయన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు (HariHara Veeramallu).
ఎన్నో అంచనాలతో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. డైరెక్టర్లు మారుతో.. షూటింగ్ ఆగుతూ జరుగుతూ దాదాపు ఐదేళ్ల తరువాత విడుదలకు మోక్షాన్ని అందుకుంది. ఎట్టకేలకు జూలై 24 న వీరమల్లు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మునుపెన్నడూ లేనివిధంగా పవన్ ప్రెస్ మీట్ కు అటెండ్ అయ్యాడు. ఒక సినిమా కోసం పవన్ ప్రెస్ మీట్ కు రావడం చాలా గ్యాప్ తరువాత ఇదే మొదటిసారి. ఇక ఈ ప్రెస్ మీట్ లో పవన్ మరోసారి తనకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పడం సెన్సేషన్ గా మారింది.
' ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. చాలా ఛాలెంజింగ్ పరిస్థితిలలో, చాలా ఒడిదుడుకుల్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్లి.. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా.. అంటే నాకు పొలిటికల్ గా పేరు ఉండొచ్చు. దేశ వ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చు కానీ, సినిమా పరంగా చూస్తే నేను చాలామంది హీరోల కన్నా తక్కువ. దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతావారికి బిజినెస్ అయ్యినంతగా నా సినిమాకు బిజినెస్ అవ్వదు. వారికి వచ్చినన్ని కలక్షన్స్ నాకు రావు. ఎందుకంటే నా దృష్టి ఎప్పుడు నా సినిమాలపై పెట్టలేదు. సొసైటీ, రాజకీయాల మీద పెట్టినంత దృష్టి సినిమాల మీద పెట్టలేదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Pawan kalyan Press meet: రత్నంగారు నలిగిపోవడం చూడలేక.. పవన్ ప్రెస్‌మీట్
Peddi - Ram Charan: పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్ మిషన్