సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Priyanka Mohan: మేడ్ ఇన్ కొరియా.. నాగార్జున డైరెక్టర్ తో ప్రియాంక మోహన్

ABN, Publish Date - Oct 13 , 2025 | 03:10 PM

అందాల భామ ప్రియాంక మోహన్ (Priyanka Mohan).. ఓజీ (OG) సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.

Priyanka Mohan

Priyanka Mohan: అందాల భామ ప్రియాంక మోహన్ (Priyanka Mohan).. ఓజీ (OG) సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. కన్మణి పాత్రలో అమ్మడి నటనకు ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్ - ప్రియాంక మోహన్ పెయిర్ ఎంతో చూడముచ్చటగా ఉంది. ఓజీలో వీరిద్దరి లవ్ ట్రాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా తరువాత ప్రియాంకకు ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు అంటే అతిశయోక్తి కాదు.


ఇక ఓజీ తరువాత ప్రియాంక మోహన్ ఒక నెట్ ఫ్లిక్స్ మూవీకి సైన్ చేసింది. అదే మేడ్ ఇన్ కొరియా. రా కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆకాశం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక చాలా గ్యాప్ తరువాత రా కార్తీక్ తెలుగులో అక్కినేని నాగార్జున వందవ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతోనే అతని గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు ఆ సినిమా కన్నా ముందే నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీతో రా కార్తీక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రియాంక చాలా క్యాజువల్ డ్రెస్ లో నడుస్తూ కనిపించింది. ప్రస్తుతం షూటింగ్ ను ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. ఇక నాగ్ వందవ సినిమా డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై బజ్ ఇంకా పెరిగింది. మరి ఈ సినిమా కార్తీక్ కు ఎలాంటి విజయాన్ని తీసుకొచ్చిపెడుతుందో చూడాలి.

Keerthy Suresh: జగపతిబాబుకి కీర్తి క్షమాపణ.. ఎందుకంటే..

Little Hearts: సాయి మార్తాండ్ తో నితిన్ సినిమా...

Updated Date - Oct 13 , 2025 | 04:35 PM