Keerthy Suresh: జగపతిబాబుకి కీర్తి క్షమాపణ.. ఎందుకంటే..
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:08 PM
నటుడు జగపతిబాబుకు (Jagapathibabu) కీర్తి సురేశ్ (Keerthy siresh) క్షమాపణలు చెప్పారు. జీ5 ఓటీటీ వేదికగా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’.
నటుడు జగపతిబాబుకు (Jagapathibabu) కీర్తి సురేశ్ (Keerthy siresh) క్షమాపణలు చెప్పారు. జీ5 ఓటీటీ వేదికగా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాజాగా ఈ షోలో కీర్తి సురేశ్ పాల్గొని తన పెళ్లికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. మొదట జగపతిబాబును పెళ్లికి పిలవనందుకు క్షమాపణ చెప్పారు కీర్తి. రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టమని, కాలేజ్ ఎగ్గొట్టి ఆయన సినిమాలకు వెళ్లానని తెలిపారు.
‘ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి నా ప్రేమ గురించి తెలుసు. అందులో జగపతిబాబు కూడా ఒకరు. పెళ్లి అయ్యేవరకూ నా ప్రేమ గురించి చాలా తక్కువమందికి చెప్పాను. నేను మిమ్మల్ని (జగపతిబాబు) నమ్మాను కాబట్టి మీతో నా వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నాను. కానీ, పెళ్లికి పిలవలేకపోయాను. క్షమించండి’ అని కీర్తి అన్నారు.
ఆంథోనీ తటిల్‌తో ప్రేమ గురించి మాట్లాడుతూ ‘ఇంట్లో వాళ్లు అంగీకారం మేరకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. 15 ఏళ్లు ప్రేమించుకున్నాం. ఆరేళ్లు తను ఖతార్‌లో ఉన్నాడు, నేను ఇండియాలో ఉన్నాను. అక్కడి నుంచి వచ్చాక ఇంట్లో చెప్పాలనుకున్నాం. నాలుగేళ్ల క్రితమే ఇంట్లో చెప్పాం. మతాలు వేరని, ఇంట్లో అంగీకరిస్తారో లేదో అని భయపడ్డా కానీ.. మా నాన్న వెంటనే అంగీకరించారు. ఇంట్లో చెప్పడం కంటే ముందే మీకు చెప్పా’ అని కీర్తి అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ ‘విజయ్ హీరోగా ‘భైరవ’ సినిమాలో నేనూ యాక్ట్ చేశా. అందులో కీర్తి సురేశ్ హీరోయిన్. విజయ్ పక్కన ఆమెను చేసి ‘ఈ అమ్మాయేంటి.. విజయ్ పక్కన’ అనుకున్నా. కీర్తి అసలు నచ్చలేదు నాకు. అందుకే అలా అనుకున్నా. తర్వాత నటనతో కట్టిపడేసింది’ అని అన్నారు.