SSMB29: మహేశ్ లేకుండా ప్రియాంక మొదలెట్టేసిందిగా

ABN , Publish Date - Jun 25 , 2025 | 06:42 PM

సెట్స్‌కి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఆ కాంబినేషన్. హైదరాబాద్‌లో షూటింగ్ హడావిడి స్టార్ట్ కావడమే కాదు.. దానికోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోలో డాన్స్ రిహార్సల్స్‌తో హైప్ పీక్స్‌లో ఉంది. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ టాక్ ఫైర్ లాంటి స్పీడ్‌తో ట్రెండ్ అవుతోంది.‌ఇంతకీ ఏమిటా మూవీ.. ఎవరా బ్యూటీ..

టాలీవుడ్‌లో మాస్ బ్లాస్ట్ కాంబో రాజమౌళి-మహేశ్ బాబుల మూవీ 'SSMB29' సీక్రెట్ గా, చకాచకా షూటింగ్ చేసుకుంటోంది. సమ్మర్ హాలీడేస్‌లో కాస్త రిలాక్స్ అయిన టీమ్ ఇప్పుడు షూటింగ్ మోడ్‌లోకి వచ్చేసింది. సెట్స్‌పై జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మహేశ్ బాబు కూడా ఇప్పటికే షూట్‌లో జోరు చూపిస్తున్నాడని బజ్. వారణాసి సెట్ లో అదిరిపోయే సీన్లను తెరకెక్కించబోతున్నాడట. జక్కన్న నుంచి సినిమా గురించి అఫీషియల్ అప్‌డేట్ లేకపోయినా, సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి హైప్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో ఉంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా భాగమవుతుందని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రియాంక సోలోగా డాన్స్ రిహార్సల్స్‌లో బిజీగా ఉందని కొరియోగ్రాఫర్ విక్కీ భార్తియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రియాంకతో కలిసి క్లిక్ చేసిన స్టైలిష్ ఫొటోస్‌ని పోస్ట్ చేసి, హైదరాబాద్‌ని లొకేషన్‌గా ట్యాగ్ చేశాడు. దీంతో ఈ డాన్స్ రిహార్సల్స్ మహేశ్ -రాజమౌళి ప్రాజెక్ట్ కోసమేనని కన్ఫర్మ్ అయిపోయింది.

హైదరాబాద్‌లో రాబోయే షెడ్యూల్‌లో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాలపై ఓ సూపర్ కూల్ సాంగ్‌ని రాజమౌళి షూట్ చేయబోతున్నాడని టాక్. విక్కీ భార్తియా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక గురించి వైబ్‌తో రాసుకొచ్చాడు: ప్రియాంక చోప్రా గారితో వర్క్ చేయడం అదిరిపోయే ఫీల్ అని.. గ్లోబల్ స్టార్ ఎనర్జీ, డెడికేషన్ టోటల్‌గా ఇన్‌స్పైరింగ్ అని.. అందరినీ రెస్పెక్ట్‌తో ట్రీట్ చేస్తూ, హార్డ్ వర్క్‌తో పాటు టీమ్‌ని కేర్‌ఫుల్‌గా చూసుకుంటుందని.. ఈ జర్నీలో భాగం కావడం రియల్‌గా గర్వంగా ఉందంటూ పోస్ట్ డ్రాప్ చేశాడు. మొత్తానికి ఈ కొత్త షెడ్యూల్‌తో సినిమా హైప్ మరింత పెరిగిపోతోంది. మరి ఈ మాస్ కాంబో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి!

Also Read: Sreeleela: తప్పుకుందా... తప్పించారా...

Also Read: Vijay Antony: ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కొత్తేమి కాదు.. శ్రీకాంత్ అరెస్ట్ పై విజయ్ స్పందన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 25 , 2025 | 06:44 PM