Priyanka Mohan: నిన్న సాయిపల్లవి... నేడు ప్రియాంక మోహన్
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:23 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినీ సెలబ్రిటీల పాలిట శాపంగా మారింది. నకిలీ ఫొటోలు, వాయిస్‌లను ఎఐ క్రియేషన్‌లో క్రియేట్ చేసి తారలకు చుక్కలు చూపిస్తున్నారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినీ సెలబ్రిటీల పాలిట శాపంగా మారింది. నకిలీ ఫొటోలు, వాయిస్‌లను ఎఐ క్రియేషన్‌లో క్రియేట్ చేసి తారలకు చుక్కలు చూపిస్తున్నారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. తారల పాలిట ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. ఇటీవల చాలామంది తారలు ఎఐ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా సాయిపల్లవికి సంబంధించిన వెకేషన్ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. అవి నిజం కావని, ఎఐలో క్రియేట్ చేసిన ఫొటోలని ఆమె తర్వాత తెలిపింది. ఇప్పుడేమో ‘ఓజీ’ చిత్రంతో విజయం అందుకున్న నటి ప్రియాంకా అరుల్ మోహన్‌కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. తనకు సంబంధించి ఎఐలో సృష్టించిన కొన్ని ఫేక్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై ఆమె స్పందించారు.
‘నా పేరుతో ఎఐలో సృష్టించిన నకిలీ చిత్రాలు ప్రచారం అవుతున్నాయి. దయచేసి వాటిని షేర్ చేయడం ఆపండి. ఏఐ లాంటి టెక్నాలజీని సృజనాత్మకత కోసం ఉపయోగించాలి కానీ ఇలా తప్పుదారి పట్టించడానికి కాదు. 'ఇలాంటివి క్రియేట్ చేసి ఏం సాధిస్తున్నాం.. సమాజానికి ఏం చెబుతున్నాం అనేది ఆలోచించండి’ అంటూ ఆమె మండిపడ్డారు. ఇటీవల విడుదలై విజయం సాధించిన ఓజీ చిత్రంలో ఆమె కన్మణి పాత్రలో మెప్పించింది.