Women’s Cricket Team: మహిళా క్రికెట్ జట్టుకు సెలబ్రిటీల అభినందనలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:02 PM
మహిళా క్రికెట్ జట్టుకు సెలబ్రిటీల అభినందనలు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం (Women’s Cricket Team) తెలిసిందే. సెమీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌ను చిత్తు చేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దీంతో హర్మన్‌ప్రీత్ సేనపై సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి (SS rajamouli)  టీమ్ ఇండియాను చూసి దేశం గర్విస్తోందని అభినందనలు తెలిపారు. ఆ మేరకు ట్వీట్ చేశారు. 
‘భారత మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఎంతో ధైర్యంతో చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేని స్కోరు మీరు  ఛేదించి దేశం గర్వపడేలా చేశారు. ఫైనల్లో మరోసారి చరిత్ర సృష్టించండి’ అని రాజమౌళి  ట్వీట్ చేశారు. 
‘టీమ్ ఇండియా అద్భుతమైన ఆటతో అదరగొట్టింది. సెమీఫైనల్లో రికార్డు స్కోరును ఛేదించడం చిన్న విషయం కాదు. జెమీమా, హర్మన్ ప్రీత్, రిచా, దీప్తి అందరూ గొప్పగా ఆడారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇదే ఉత్సాహంతో ట్రోఫీని తీసుకురండి’ 
- వెంకటేశ్  
‘కలలు కనండి.. మిమ్మల్ని మీరు నమ్మండి.. విజయాన్ని సాధించండి. నిజమైన ఛాంపియన్లు ఎలా ఉంటారో మన మహిళలు ప్రపంచానికి చూపించారు. సరికొత్త చరిత్ర సృష్టిస్తూ భారత్ ఫైనల్‌లో అడుగుపెట్టింది’
- సోనూసూద్
‘ఇవి ఇండియాకు గొప్ప క్షణాలు. ఉత్కంఠభరితమైన విజయంతో మన మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది. దృఢ సంకల్పం, యునిటీ, టాలెంట్ ఇలా అన్నిటితో చక్కని ప్రదర్శన ఇచ్చారు.
- రిషబ్ శెట్టి
‘నిజంగా ఇది గొప్ప వార్త.. మనం ఫైనల్స్‌కు చేరాం. టీవ్ ఇండియాకు అభినందనలు’ 
- లావణ్య త్రిపాఠి.