SSS Motion Poster: టైం పది అయ్యింది... గ్లాసులు కడుక్కునే టైం అయ్యింది

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:35 PM

ఒక్క హిట్.. జీవితాన్ని మార్చేస్తుంది. నటుడు శివాజీ విషయంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు హీరోగా మంచి సినిమాలను ప్రేక్షకులను అందించిన శివాజీ (Shivaji).. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఒక్క హిట్.. జీవితాన్ని మార్చేస్తుంది. నటుడు శివాజీ విషయంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు హీరోగా మంచి సినిమాలను ప్రేక్షకులను అందించిన శివాజీ (Shivaji).. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. బిగ్ బాస్ షోతో మరోసారి జనాల్లోకి వెళ్లి గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే #90s అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం.. అది భారీ విజయం సాధించడం శివాజీకి లక్ ఫ్యాక్టర్ అనుకోవాలి.  తదుపరి కోర్ట్  సినిమాలో మంగపతిగా మరోసారి మెప్పించారు. ప్రస్తుతం ఓటీటీ సిరీస్ లతో బిజీ గా ఉన్నారు.  దీపావళీ సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.  

శివాజీ, లయ (Laya) జంటగా #90s సిరీస్ తో ఫేమస్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'సాంప్రదాయినీ.. సుప్పినీ.. సుద్దపూసనీ' (Sampradayini Suppini Suddapoosani  సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివాజీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వేడుక సాంప్రదాయంగా పబ్ లో నిర్వహించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఇది  శివాజీ చెప్పారు.   ప్రస్తుతం ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. దీనితో పటు పబ్ లో పృథ్వీ, అలీ, శివాజీ మధ్య జరిగిన సరదా సంభాషణల్ని విడుదల చేయగా అందులో 'టైం పది అయ్యింది... గ్లాసులు కడుక్కునే టైం అయ్యింది' అని పృథ్వీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. 

Updated Date - Oct 27 , 2025 | 02:36 PM