సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhas: డార్లింగ్.. లుక్ తోనే చంపేస్తున్నాడుగా

ABN, Publish Date - Jul 11 , 2025 | 02:32 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్.

Prabhas

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. తెలుగువారి ఖ్యాతి అని కూడా చెప్పొచ్చు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు. ఇక ఆ సినిమా తరువాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ప్రభాస్.. గత కొన్నేళ్లుగా ట్రోల్స్ ఎదుర్కుంటున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఆదిపురుష్ సమయంలో ప్రభాస్ ముఖం మరింత మారిపోవడంతో బాలీవుడ్ మొత్తం ఆయన లుక్స్ పై ట్రోల్ చేసింది.


ముఖం బొద్దుగా మారిపోయి, కళ్ల కింద క్యారీ బ్యాగ్ లు వచ్చి.. అస్సలు గుర్తుపట్టలేకుండా ఉండడంతో ఇతను రాముడు ఏంటి అని ట్రోల్ చేశారు. ఆ తరువాత కూడా డార్లింగ్ లుక్ పై చాలామంది చాలా విమర్శలు చేశారు. అంతేకాకుండా డార్లింగ్ మద్యానికి బానిస అయ్యాడంటూ కూడా రూమర్స్ వచ్చాయి. ఇక ఎట్టకేలకు ఆ ట్రోలర్స్ కు డార్లింగ్ గట్టి సమాధానం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ట్రోలర్స్ కూడా ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఈ మధ్యనే ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన విషయం తెల్సిందే.


బాహుబలి సినిమా సమయంలో జరిగిన ప్రమాదం.. ఇప్పటికీ డార్లింగ్ ను వేధిస్తూనే ఉందని సమాచారం. దానికోసమే విదేశాల్లో ప్రభాస్ చికిత్స తీసుకుంటున్నాడు. ఇక ఈసారి విదేశాల నుంచి వచ్చాకా డార్లింగ్ లుక్ లో చాలా తేడా వచ్చింది. రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ లుక్ మొత్తం మార్చేశాడు. బరువు తగ్గి వింటేజ్ ప్రభాస్ లా కనిపిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా డార్లింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నాడు. తాజాగా బాహుబలి రీయూనియన్ పార్టీలో డార్లింగ్ హైలైట్ గా నిలిచాడు. సడెన్ గా డార్లింగ్ ను చూసి వర్షం సినిమా సమయంలో ఉన్న ప్రభాస్ అన్నట్లు కనిపించాడు. బ్లాక్ కలర్ షర్ట్., ట్రిమ్ చేసిన గడ్డం, ఒత్తైన జుట్టుతో చాలా యంగ్ లుక్ లో కనిపించాడు.


ప్రభాస్ ను ఈ వింటేజ్ లుక్ లో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజాసాబ్ తరువాత ప్రభాస్ నటిస్తున్న పౌజీ సినిమాలో కూడా డార్లింగ్ ఈ లుక్ లోనే కనిపించనున్నాడని టాక్. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఏదిఏమైనా ట్రోలర్స్ నోరు మూపించి ఇండస్ట్రీని తన లుక్ తో షేక్ చేశాడు ప్రభాస్. మరి ఈ సినిమాలతో డార్లింగ్ ఎలాంటి విజయాలను అందుకుంటాడు అనేది తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి ఉండక తప్పదు.

Son Of Sardaar 2: అజ‌య్ దేవ‌గ‌ణ్.. స‌న్ ఆఫ్ స‌ర్దార్‌ 2 ట్రైల‌ర్‌

Updated Date - Jul 11 , 2025 | 02:34 PM