Son Of Sardaar 2: అజ‌య్ దేవ‌గ‌ణ్.. స‌న్ ఆఫ్ స‌ర్దార్‌ 2 ట్రైల‌ర్‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:43 PM

అజ‌య్ దేవ‌గ‌ణ్, మృణాల్ జంట‌గా రూపొందిన చిత్రం స‌న్ ఆఫ్ స‌ర్దార్‌ 2 ట్రైల‌ర్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు.

son of

ద‌శాబ్దం క్రితం సునీల్, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌ర్యాద రామ‌న్న చిత్రాన్ని అజ‌య్ దేవ‌గ‌ణ్ (Ajay Devgn) బాలీవుడ్‌లో స‌న్ ఆఫ్ స‌ర్దార్‌గా రీమేక్ చేసి మంచి విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిదే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా స‌న్నాఫ్ స‌ర్దార్ 2 (Son of Sardaar -2) అంటూ మ‌రో చిత్రాన్ని రూపొందించారు.

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూలై 25న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు, టీజ‌ర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా తాజాగా శుక్ర‌వారం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చేస్తూ ఆసాంతం మంచి కామెడీ ప్ర‌ధానంగా సాగింది.

Updated Date - Jul 11 , 2025 | 01:48 PM