Kishkindhapuri Teaser: కిష్కింధపురి టీజర్ చూశారా.. ప్యాంట్ తడిచిపోవడమే
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:00 PM
చాలా కాలంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas) మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, అది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
Kishkindhapuri Teaser: చాలా కాలంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas) మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, అది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ వెనక్కి తగ్గలేదు. ఇక ఈసారి హర్రర్ కథతో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్దమయ్యాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం కిష్కింధపురి(Kishkindhapuri). కౌశిక్ పెగ్గలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గార్లపాటి నిర్మించాడు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ జంట రాక్షసుడు సినిమాలో కనిపించారు.
ఇప్పటికే కిష్కింధపురి నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నమస్కారం.. ఈరోజు శుక్రవారం అంటూ ఒక బేస్ లేడీ వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. టీజర్ లో కథను తెలియకుండా జాగ్రత్త పడ్డారు. చూచాయగా ఇదొక హర్రర్ సినిమా అని చూపించారు. సువర్ణ మహల్ అనే బంగ్లా.. దానిలోపలికి వెళ్లిన హీరో, హీరోయిన్, అక్కడ జరిగే భయంకరమైన సంఘటనల షాట్స్ ను చూపించారు. ఏదో మిస్టరీని హీరో ఛేదించే పనిలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఆ సువర్ణ మహల్ బంగ్లాలో ఏం జరిగింది.. ?హీరోకి ఏమైనా ఆత్మలు కనిపిస్తాయా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తానికి టీజర్ కొద్దిగా భయపెట్టేవిధంగానే ఉందని చెప్పొచ్చు.
ఇక టీజర్ కు హైలైట్ గా చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఉందని చెప్పాలి. విజువల్స్ కూడా చాలా అద్భుతంగా చూపించారని తెలుస్తోంది. టీజర్ తోనే సినిమాపై ఒక హైప్ క్రియేట్ చేశారు.ఆ సౌండ్స్ కి ఆ విజువల్స్ కు థియేటర్ లో ఫ్యాన్ తడిచిపోవడం ఖాయమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా బెల్లంకొండ శ్రీనివాస్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Mrunal Thakur: అప్పుడేదో చిన్నపిల్లని.. ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చిన మృణాల్
Sir Madam - ott: సార్ మేడమ్’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే!