Mrunal Thakur: అప్పుడేదో చిన్నపిల్లని.. ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చిన మృణాల్
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:27 PM
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోవరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ హిందీలో కూడా తన సత్తా చాటుతుంది.
Mrunal Thakur: బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోవరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ హిందీలో కూడా తన సత్తా చాటుతుంది. సాధారణంగా ఈమధ్యకాలంలో సెలబ్రిటీలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవి సోషల్ మీడియాలో ప్రభావం చూపుతున్న విషయం తెల్సిందే. కొన్నిసార్లు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఒప్పుకోవాలి. మృణాల్ ఠాకూర్ కూడా ప్రస్తుతం అదే చేసింది. తెలిసి తెలియని వయస్సులో ఆమె చేసిన వ్యాఖ్యలు స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా వదలడం లేదు. ఇక ఎట్టకేలకు ఆ వివాదానికి మృణాల్ ఫుల్ స్టాప్ పెట్టింది.
మృణాల్ సీరియల్ హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. తన చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ కి చేరుకుంది. ఇక ఆ సమయంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో అప్పటి స్టార్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ బిపాసా బసుపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అందం గురించి మాట్లాడుతూ.. బిపాసా పురుషుడిలా ఉంటుంది అని, ఆమె దేహం కండలు తిరిగి మగాడి దేహంలా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆమెతో పోలిస్తే తానెంతో అందంగా ఉంటానని చెప్పుకొచ్చింది. ఇక అప్పట్లో మృణాల్ వ్యాఖ్యలు బాలీవుడ్ ను షేక్ చేశాయి. చాలామంది మృణాల్ ను తప్పుబట్టారు.
బిపాసా బసు కూడా మృణాల్ కు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది. మహిళలు అంతా దృఢంగా ఉండాలని, అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది. ఇక దీంతో మృణాల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరింది. అదేదో చిన్నతనంలో తెలిసి తెలియక చేసిన వ్యాఖ్యలు అని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదని పోస్ట్ పెట్టింది. '19 ఏళ్ల నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు చాలా తెలివితక్కువ మాట్లాడిన మాటలు అవి. నా మాటలు అంతమందిని బాధపెడతాయి అని అప్పుడు అర్ధం కాలేదు. నేను సరదాగా అన్నాను. అప్పుడు నాకు అందానికి అసలైన అర్ధం తెలియదు. ఇప్పుడు తెలిసాక చాలా చింతిస్తున్నాను. నా ఉద్దేశ్యం ఎవరీ శరీర ఆకృతిని అవమానపర్చడం కాదు. ఇంటర్వ్యూలో అది సరదాగా మాట్లాడిన మాట, అది చాలా దూరం వెళ్ళింది. నేను మాట్లాడిన మాటలు వేరుగా అర్ధం చేసుకున్నారు. పెరిగే కొద్దీ అందానికి అసలైన అర్ధం అంటే ఏంటో తెలుసుకున్నాను. అది ఎంతో విలువైనది. మనసుతో చూస్తే ప్రతిదీ అందంగానే ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
VenkateshXTrivikram: మొదలెట్టేసిన గురూజీ - వెంకీ మామ
WAR2 Jr Ntr: పని చేయించుకుని పక్కన పెట్టడం కాదు.. వార్2 డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించి!