Ustaad Bhagat Singh: క్లయిమాక్స్ పూర్తి... సాంగ్ షురూ

ABN , Publish Date - Jul 30 , 2025 | 07:21 PM

'ఉస్తాద్ భగత్ సింగ్' క్లయిమాక్స్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ వెంటనే పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. పవన్, శ్రీలీల కాంబోలో హరీశ్ శంకర్ ఈ పాటను మూడు రోజుల పాటు చిత్రీకరించబోతున్నారు.

Ustad Bhagat Singh

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) శరవేగంగా తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే 'ఓజీ' వర్క్ పూర్తి చేసిన పవన్ ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'కు డేట్స్ ఇచ్చారు. ఇటీవలే ఈ సినిమా క్లయిమాక్స్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు సాంగ్ పిక్చరైజేషన్ లో పాల్గొంటున్నారు. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో వేసిన స్పెషల్ సెట్ లో మూడు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరుగునుంది. బుధవారం పాట షూట్ ను దర్శకుడు హరీశ్‌ శంకర్ మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్‌, శ్రీలీల మీద ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను రాశీ ఖన్నా, పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, రాంకీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు పోషిస్తున్నారు.


పవన్ కళ్యాణ్ ను కలిసిన కింగ్ డమ్ టీమ్!

WhatsApp Image 2025-07-30 at 7.49.35 PM.jpeg

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్ డమ్' మూవీ గురువారం జనం ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో మీడియా సమావేశం జరిగింది. మీడియాతో మాట్లాడిన అనంతరం ఆ పక్కనే ఫ్లోర్ లో జరుగుతున్న పవన్ కళ్యాణ్‌ 'ఉస్తాద్ భగత్ సింగ్' పాట చిత్రీకరణ దగ్గరకు 'కింగ్ డమ్' హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగవంశీ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ను సెట్ లో కలుసుకుని కాసేపు ముచ్చటించారు.

Also Read: Sankarabharanam: కళాతపస్విని మెచ్చిన నటరత్న

Also Read: Kingdom: ప్రీ రిలీజ్ టిక్కెట్స్ సేల్ సూపర్

Updated Date - Jul 30 , 2025 | 08:07 PM