Pawan Kalyan: హరిహర వీరమల్లు డబ్బింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్
ABN , Publish Date - May 29 , 2025 | 07:14 PM
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'హరి హర వీరమల్లు' డబ్బింగ్ ను పూర్తి చేశారు. ఏకబిగిన నాలుగు గంటల్లో దీనిని పూర్తి చేశారని ఎ.ఎం. రత్నం తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొద్ది రోజులుగా బాలెన్స్ ఉన్న తన సినిమా షూటింగ్స్ పై దృష్టిపెట్టారు. ఇప్పటికే 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ తన వంతు డబ్బింగ్ ను కూడా ఏకబిగిన పూర్తి చేసినట్టు చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం (A. M. Ratnam) తెలిపారు. షూటింగ్ బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ దానిని పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ గా నాలుగు గంటల్లో దాన్ని పూర్తి చేశారని ఆయన చెప్పారు. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో 'హరి హర వీరమల్లు' విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమాలోని 'తార తార...' అనే పాటను చెన్నయ్ లో విడుదల చేశారు. పబ్లిసిటీని పీక్స్ కు తీసుకెళుతున్న మేకర్స్ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా అందచేస్తున్నారు. సినిమా థియేటర్ల బంద్ అంశం ఇప్పుడు అటకెక్కేయడంతో రాబోయే రెండు మూడు వారాలలో తమ చిత్రాలను విడుదల చేయబోతున్న నిర్మాతలంతా ఊపిరి పీల్చుకున్నారు.
'ఓజీ'లో నారా రోహిత్, శిరీష
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు. అయితే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓజీ' కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో వివిధ భాషలకు చెందిన నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశేషం ఏమంటే... ప్రస్తుతం 'భైరవం' సినిమాలో కీ-రోల్ ప్లే చేస్తున్న నారా రోహిత్ సైతం 'ఓజీ'లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 'భైరవం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి 'ఓజీ'లో పవన్ కళ్యాణ్ చెల్లిగా నారా రోహిత్ కాబోయే భార్య శిరీషా లేల్లా నటిస్తోందని అంటున్నారు. అలానే పనిలో పనిగా నారా రోహిత్ కోసం కూడా ఓ పాత్రను క్రియేట్ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది.
Also Read: Gaddar Awards: ఇది నిజమైన గౌరవం.. ప్రభుత్వానికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు
Also Read: Param Sundari: జాన్వీ కపూర్.. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ! పరమ్ సుందరి ఫస్ట్ లుక్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి