Gaddar Awards: ఇది నిజమైన గౌరవం.. ప్రభుత్వానికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు
ABN , Publish Date - May 29 , 2025 | 06:34 PM
గత ఏడాది ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్‌కు మరో అరుదైన పురస్కారం దక్కింది. గురువారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు వరించింది.
గత ఏడాది ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్‌కు (Allu arjun) మరో అరుదైన పురస్కారం దక్కింది. గురువారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో (Gaddar Awards) అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు వరించింది ‘పుష్ప2’లో నటనకు గానూ బన్నికి ఈ పురస్కారం దక్కింది. దీనిపై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘తొలిసారి ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024’లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికవడం నాకు దక్కిన నిజమైన గౌరవం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రశంసలన్నీ దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాతలు, పుష్ప టీమ్ మొత్తానికి దక్కుతాయి. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం చేస్తున్నా. మీరు అందిస్తున్న సహకారం ప్రతిసారి నాలో స్ఫూర్తినింపుతుంది’ అని ఎక్స్‌లో అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. మరో అగ్ర కథానాయకుడు జూ. ఎన్టీఆర్ కూడా ఈ అవార్డులపై స్పందించారు. ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్-2024’ విజేతలకు అభినందనలు అని ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేలా అవార్డులను అందిస్తూ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు’ అన్నారు. ‘దేవర’ సినిమాకు డాన్స్ కొరియోగ్రఫీ చేసిన గణేశ్ ఆచార్య ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎంపిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు.