Param Sundari: జాన్వీ కపూర్.. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ! పరమ్ సుందరి ఫస్ట్ లుక్
ABN , Publish Date - May 29 , 2025 | 06:27 PM
బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా రూపొందుతున్న చిత్రం పరమ్ సుందరి.
బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా రూపొందుతున్న చిత్రం పరమ్ సుందరి (Param Sundari). కేరళ నేపథ్యంలో ఫీల్‌గుడ్ మూవీగా తెరకెక్కింది. తుషార్ జలోటా (Tushar Jalota) దర్శకత్వం వహించగా ఇటీవల స్త్రీ, ముంజియా, ఛావా వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో నార్త్‌లో దూసుకుపోతున్న మడాక్ ఫిలింస్ (maddock films) ఈ చిత్రాన్ని నిర్మించింది. జూలై 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం ఫస్ట్ లుక్ అంటూ ఈ మూవీ నుంచి ఓ చిన్న వీడియోను విడుదల చేశారు.