Poonam Kaur: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. ఆయన ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన పూనమ్
ABN, Publish Date - Sep 02 , 2025 | 05:14 PM
నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల కన్నా వివాదాలతోనే అమ్మడు ఫేమస్ అయ్యింది.
Poonam Kaur: నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల కన్నా వివాదాలతోనే అమ్మడు ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా త్రివిక్రమ్ (Trivikram), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ కొద్దిగా అవకాశం దొరికినా.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పై అమ్మడు విరుచుకుపడుతూ ఉంటుంది.
ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పూనమ్.. అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈరోజు పవన్ పుట్టినరోజు మాత్రమే కాకుండా ys రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన రోజు అన్న విషయం కూడా తెల్సిందే. సినీ, రాజకీయ నేతలు అందరూ పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతుంటే పూనమ్ మాత్రం ys రాజశేఖర్ రెడ్డి ఫోటోను షేర్ చేసి వైట్ కలర్ హార్ట్ ను క్యాప్షన్ గా పెట్టింది. ఇక ఈ పోస్ట్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కు కౌంటర్ గా కావాలనే పూనమ్ ys రాజశేఖర్ రెడ్డి ఫోటోను షేర్ చేసిందని, అందరూ పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పడం తట్టుకోలేకపోతుందని చెప్పుకొస్తున్నారు.
అయితే ఇంకొందరు మాత్రం పూనమ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. నేడు ys రాజశేఖర్ రెడ్డి వర్దంతి కావడంతో ఆమె ఫోటో షేర్ చేసింది. అందులో తప్పేమీ లేదు. ఇందులో ఎలాంటి కౌంటర్ లేదు.. పూనమ్ పై ట్రోల్స్ చేయకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మాయాజాలం సినిమాతో పూనమ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నా పూనమ్ కు ఆశించిన గుర్తింపు రాలేదు. ఇక జల్సా సినిమాలో పార్వతి మెల్టన్ పాత్రకు మొదట పూనమ్ నే అనుకున్నారని, ఆ తరువాత త్రివిక్రమ్.. ఆమెను కాదని పార్వతికి ఛాన్స్ ఇచ్చాడని, దీని వలనే పూనమ్ కెరీర్ పోయిందని టాక్. ఇకపోతే ప్రస్తుతం పూనమ్ సినిమాలకు దూరంగా ఉంటుంది.
Love in Vietnam: చైనాలో పది వేల స్క్రీన్స్ లో.