Pithapuramlo: ‘పిఠాపురంలో’ టైటిల్ పోస్టర్ ఆవిష్కరణ
ABN, Publish Date - Nov 11 , 2025 | 06:07 PM
తెలుగు రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు ఒక్కటయ్యారు. ఒకరి నియోజకవర్గంలోకి మరొకరు వెళ్లారు. ఎవరు ఎవరి నియోజకవర్గంలోకి వెళ్లారు.. అసలు ఎందుకు వెళ్లారు.. అని డౌట్ వస్తోందా.. అయితే ఈ స్టోరీ చూడండి.. ఆ కన్ఫ్యూజన్ పోతుంది.
'ప్రేయసి రావే' సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టి అనేక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మహేష్‌చంద్ర. 'అయోధ్య రామయ్య, హనుమంతు' వంటి చిత్రాలతో అలరించాడు. అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ డైరెక్టర్ మెగాఫోన్ పట్టాడు. 'పిఠాపురంలో' సినిమాతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి, సైలెంట్ గా పూర్తి చేసేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీద 'పిఠాపురంలో' మూవీ టైటిల్ పోస్టర్ ను ఆవిష్కరణ జరిగింది. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన ప్రధాన తారాగణంగా ఈ మూవీ రూపొందుతోంది. దీని కాన్సెప్ట్ చూస్తుంటే.. మంచి సందేశాత్మక చిత్రంగా అనిపిస్తోందని, యువతరం కుటుంబ సమేతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఎదగాలనే సందేశం ఈ సినిమాలో ఉందనిపిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు.
ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందనే పాయింట్‌ని దర్శకుడు మహేష్‌చంద్ర అద్భుతంగా డీల్ చేశాడని నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’ తరహాలో సందేశాన్ని అందిస్తూనే యువతరాన్ని ఆకట్టుకునే అంశాలున్న సినిమా అని తెలిపారు. ఈ ఇంటర్‌నెట్ యుగంలో తల్లిదండ్రులంటే గౌరవం కనబరచని యువతకు కనువిప్పు కలిగించే చిత్రం అవుతుందని మరో నటుడు పృథ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. 'ప్రేయసిరావే' సినిమాలాగే తన కెరీర్ లో 'పిఠాపురంలో' కూడా గొప్ప చిత్రమవుతుందని డైరెక్టర్ మహేష్ చంద్ర ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
Read Also: 12A Railway Colony Trailer: అల్లరోడు ఈసారి గట్టిగానే భయపెట్టేలా ఉన్నాడే ..
Read Also: Chinmyi Sripada: జానీ మాస్టర్ పై మరోసారి చిన్మయి కన్నెర్ర....