12A Railway Colony Trailer: అల్లరోడు ఈసారి గట్టిగానే భయపెట్టేలా ఉన్నాడే ..
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:11 PM
హీరో అల్లరి నరేష్ (Allari Naresh) గత కొన్నేళ్లుగా ఒక మంచి విజయం కోసం కష్టపడుతూనే ఉన్నాడు. ట్రెండ్ కు తగ్గట్లు ప్రతి జానర్ ను ప్రయత్నిస్తూనే వస్తున్నాడు.
12A Railway Colony Trailer: హీరో అల్లరి నరేష్ (Allari Naresh) గత కొన్నేళ్లుగా ఒక మంచి విజయం కోసం కష్టపడుతూనే ఉన్నాడు. ట్రెండ్ కు తగ్గట్లు ప్రతి జానర్ ను ప్రయత్నిస్తూనే వస్తున్నాడు. అయినా కూడా విజయం దక్కడం లేదు, ఇక ప్రస్తుతం హారర్ నేపథ్యంలో వస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. దీంతో కామెడీగా కాకుండా సీరియస్ గా భయపెట్టడానికి సిద్దమయ్యాడు.
అల్లరి నరేష్ హీరోగా నాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 12A రైల్వే కాలనీ. పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రైటర్ అనిల్ విశ్వనాధ్ ఈ కథను అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షీ భాస్కర్ల హీరోయిన్ గా నటించగా.. సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హారర్ థ్రిల్లర్ కథలా కనిపిస్తుంది కానీ, ట్రైలర్ లో అవేమి చూపించలేదు. కార్తీక్ అనే కుర్రాడికి కొన్ని కొన్ని సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. అవేమి మిగతావారికి కనిపించవు. అవి నిజాలా.. ఊహలా అని తెలియని కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇక ఆ సమయంలోనే అతనికి ఒక అమ్మాయి పరిచయమవుతుంది. ఆ పరిచయం..ఆ అమ్మాయి నిజమా.. అతని ఊహానా.. ? మర్డర్ కేసులో కార్తీక్ ఎందుకు ఇరుక్కున్నాడు. క్రైమ్ కంట్రోల్ బ్యూరో కి కార్తీక్ లింక్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
ట్రైలర్ అంతాగందరగోళంగా అనిపించింది. కథ మొత్తాన్ని తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా పొలిమేరలోలానే చేతబడులకు సంబంధించిన సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకు హైలైట్ అయ్యేలా అనిపిస్తుంది. 12A రైల్వే కాలనీ సినిమా నవంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అల్లరోడు ఈసారి గట్టిగా భయపెడతాడో లేదో చూడాలి.