Pellilo Pelli : పెళ్లిలో పెళ్లి ఫస్ట్ లుక్ లాంచ్
ABN , Publish Date - Aug 08 , 2025 | 05:55 PM
పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటే... కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమాలు సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా మరో క్రేజీ సబ్జెక్ట్ తో ఆడియెన్స్ ను అలరించేందుకు ఓ మూవీ సిద్ధమవుతోంది. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.
టాలీవుడ్ లో చిన్న సినిమాల జోరు మాములుగా లేదు. పాన్ ఇండియా, మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతుంటే... చిన్న సినిమాలు సైతం ఆడియెన్స్ అలరించేందుకు ముస్తాబవుతున్నాయి. తాజాగా గౌరి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రం 'పెళ్లిలో పెళ్లి' (Pellilo Pelli ) ఆడియెన్స్ ను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సుఖకర్త బ్యానర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా లాంచ్ చేశారు.
గణేష్ కొల్లి (Ganesh Kolli) నిర్మిస్తున్న 'పెళ్లిలో పెళ్లి' సినిమాలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అందులో భాగంగా ఫస్ట్ లుక్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తనికెళ్ల భరణి (Tanikella Bharani) తో పాటు యంగ్ హీరో ఆకాశ్ జగన్నాధ్ (Aakash Jagannadh ) హాజరయ్యారు.
'పెళ్లి లో పెళ్లి' ఈవెంట్ జరుగుతుంటే బయట కుండపోత వర్షం కురిసిందని... ఆ పరమేశ్వరుడు గంగ రూపంలో ఆశీర్వాదం పంపించాడని పిస్తోందన్నారు తనికెళ్ల భరణి. ఈ సినిమా బ్యానర్ పేరు సుఖకర్త అని పెట్టారని... అంటే సుఖాన్ని అందించేవాడని అర్థమన్నారు. దర్శకుడు శ్రీకాంత్ కు పెద్దలంటే చాలా గౌరవమన్నారు. గణేష్ కొల్లి లాంటి ప్రొడ్యూసర్స్ మంచి సక్సెస్ ను అందుకుంటే మరిన్ని చిత్రాలను యంగ్ స్టర్స్ తో నిర్మిస్తారని భరణి అన్నారు. ఇద్దరికీ ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకొచ్చారు.
ఇటు ఈవెంట్ లో పాల్గొన్న ఆకాశ్ పూరీ మాట్లాడుతూ, 'ఇది పోస్టర్ లాంచింగ్ మాదిరి లేదని ప్రీ-రిలీజ్ ఈవెంట్ లా ఉందని' అన్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకోవడంతో పాటు చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇటు దర్శక నిర్మాతలు ఈ మూవీలోని విశేషాలను వివరించారు. కంప్లీట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ ప్రతి ఒక్కరిని అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాక ఈ ఈవెంట్ కు హాజరైన ఆకాశ్, తనికెళ్ల భరణికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: Akhanda 2: ఏంటీ ఈ కన్ఫ్యూజన్..అసలు పోటీ ఉందా.. లేదా.
Read Also: Jatadhara: సుధీర్‌బాబు జటాధర.. టీజర్ వదిలిన ప్రభాస్