Akhanda 2: ఏంటీ ఈ కన్ఫ్యూజన్..అసలు పోటీ ఉందా.. లేదా.
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:35 PM
సెప్టెంబర్ 25 అసలేం జరుగుతోంది.. ? ప్రస్తుతం టాలీవుడ్ అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్న అంటే ఇది ఒక్కటే. కొన్నిరోజులు అఖండ 2 (Akhanda 2) వాయిదా పడింది అంటారు..
Akhanda 2: సెప్టెంబర్ 25 అసలేం జరుగుతోంది.. ? ప్రస్తుతం టాలీవుడ్ అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్న అంటే ఇది ఒక్కటే. కొన్నిరోజులు అఖండ 2 (Akhanda 2) వాయిదా పడింది అంటారు.. కొన్నిరోజులు OG తో పాటు అఖండ 2 కూడా వస్తుంది అంటారు. ఇంకొన్ని రోజులు అఖండ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వలేదు అంటారు. ఇంకొన్నిరోజులు OG కోసం అఖండ 2 వెనక్కి తగ్గింది అంటారు. ఈ కన్ఫ్యూజన్ లోనే మెగా - నందమూరి అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అసలేంటి ఈ కన్ఫ్యూజన్.. ? అనేది తెలుసుకుందాం రండి.
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా అఖండ 2. కరోనా తరువాత అఖండ సినిమాతో వీరిద్దరూ చేసిన తాండవం ఇప్పటివరకు ప్రేక్షకులు మర్చిపోలేదు. దానికి సీక్వెల్ గా అఖండ 2 ను ప్రకటించాడు బోయాపాటి. ఆ సమయంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 25 న అఖండ తాండవం రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. ఇక దానికి తగ్గట్లుగానే షూటింగ్ మొదలుపెట్టి.. టీజర్ కూడా రిలీజ్ చేశాడు. ఇంకోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం OG. ఈ సినిమాపై టాలీవడ్ మొత్తం భారీ అంచనాలను పెట్టుకుంది.
రీమేక్స్ ను పక్కనపెట్టి పవన్.. కుర్ర డైరెక్టర్ ను నమ్మి చేస్తున్న సినిమా కావడంతో పాటు.. పవన్ త్వరగా ఫినిష్ చేసిన సినిమా OG. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గతేడాది సెప్టెంబర్ 25 న రిలీజ్ కావాల్సిన సినిమా కొద్దిగా ఆలస్యంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలా ఈ రెండు సినిమాలు ఒకే రోజు పోటీకి సిద్ధమయ్యాయి. ఎక్కడా తగ్గకుండా.. ఒకరంటే ఒకరు పోస్టర్స్, ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు.
పవన్ కోసం బాలయ్య తగ్గుతున్నాడని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వకపోవడంతో బోయా వెనక్కి తగ్గాడని కూడా వార్తలు వచ్చాయి. మొన్నటికి మొన్న బాలయ్య వెనక్కి తగ్గడంతో OG సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేసినట్లు కూడా ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. దీంతో OG సింగిల్ గానే అనుకున్నారట వస్తుందని చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా బోయాపాటి- బాలయ్య డబ్బింగ్ వర్క్ కూడా ఫినిష్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అంటే.. సెప్టెంబర్ 25 కి అన్ని పనులు పూర్తిచేసినట్లే కదా. అయితే OGకి అఖండ 2 కి మధ్య యుద్ధం ఉన్నట్లే. అన్ని డౌట్స్ క్లియర్ అయ్యినట్టే అని ఫ్యాన్స్ సంబురాలు మొదలుపెట్టారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సెప్టెంబర్ 25 న ఈ యుద్ధంలో గెలిచే హీరో ఎవరో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Anjali New Movie: లేడీ ఓరియెంటెడ్ మూవీలో అంజలి
Sobhita Akkineni: ఆధ్యాత్మిక యాత్రలో అక్కినేని కోడలు..