సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

They Call Him OG: మిలియన్ డాలర్ పిక్చర్ అంటే ఇదే

ABN, Publish Date - Sep 14 , 2025 | 08:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎదురుచూస్తున్న సినిమా OG. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

OG Movie

They Call Him OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎదురుచూస్తున్న సినిమా OG. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. ఇక శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై హైప్ ను మరింతగా పెంచేశాయి.


సినిమా మొదలైనప్పటి నుంచి OG కి ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25 న రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అంచనాలను పెంచేస్తూ వస్తున్నారు. రేపు ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.


ఇక తాజాగా OG కి ఫిల్లర్స్ అయిన పవన్ కళ్యాణ్, సుజీత్, థమన్ సింగిల్ ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. ఈ ఫోటోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మిలియన్ డాలర్స్ పిక్ అని క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లలో ముగ్గురు నెక్స్ట్ లెవెల్ ఫోజ్ ఇస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిజంగానే ఇది మిలియన్ డాలర్స్ పిక్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ముగ్గురు OG తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే.

Raashii Khanna: ఉస్తాద్ తో సెల్ఫీ.. జీవితాంతం గుర్తుండిపోతుందన్న రాశీ

Karthik Gattamneni: వెబ్‌సిరీస్‌లా చెప్పుంటే.. ఇంకా వివరంగా ఉండేది..

Updated Date - Sep 14 , 2025 | 08:35 PM