Karthik Gattamneni: వెబ్‌సిరీస్‌లా చెప్పుంటే.. ఇంకా వివరంగా ఉండేది..

ABN , Publish Date - Sep 14 , 2025 | 07:20 PM

తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్‌’ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. విడుదలైన రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.55.6 కోట్లు వసూళ్లు రాబట్టింది.

తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ‘మిరాయ్‌’ (Mirai) సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. విడుదలైన రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.55.6 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్‌ పంచుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్‌ చేశారు.

‘ఈ సినిమాను చిన్న పిల్లలకు ఎక్కువగా రీచ్‌ కావాలనే ఉద్దేశంతో నిడివి విషయంలో జాగ్రత్త తీసుకున్నాం. నా నిర్ణయమైతే.. 4 గంటల నిడివి ఉంచేవాడినేమో. ఈ విషయంలో ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ ఎంతో హెల్ప్‌ చేశారు. ఎప్పటికప్పుడు సింపుల్‌గా వెళ్దామని సూచించారు. కథకు అడ్డం వస్తున్నాయని రెండు పాటలు కట్‌ చేశాం. ‘వైబ్‌’ సాంగ్‌ మాకు ఆప్షనల్‌. కుదిరితే పెడదాం. లేకపోతే వద్దనుకున్నాం. పాట విడుదల చేసినప్పుడు ‘ప్రమోషనల్‌ స?ంగ్‌’ అని చెప్పి ఉంటే సరిపోయేది’. ఈ కథను వెబ్‌సిరీస్‌లా తీసి ఉంటే మరింత డీటెయిల్‌గా చెప్పేవాడిని. కచ్చితంగా దీనికి ‘పార్ట్‌-2’ ఉంటుంది అన్నారు.

‘అశోకుడు తొమ్మిది గంథ్రాలు ఉన్నాయన్న కథ ప్రచారంలో ఉంది. హిట్లర్‌ సహా పలువురు వాటి కోసం ప్రయత్నం చేశారట. అలా ప్రచారంలో ఉన్న కథలకు ఫాంటసీ జోడించి ఈ కథ రాశాను. అందుకే త్రేతాయుగం ప్రస్తావనన తెచ్చాం. ‘మిరాయ్‌’ అంటే జపనీస్‌లో భవిష్యత్‌ అని అర్థం. టైటిల్‌ కోసం చాలా పదాలు ట్రై చేశాం. కానీ, ఇది ఆసక్తికరంగా అనిపించింది. దర్శకుడు కిషోర్‌ తిరుమల ప్రాతకు ఇంకొన్ని సన్నివేశాలున్నాయి. నిడివి కారణంగా అవి తీసేశాం. ప్రస్తుతం కథల్లో రాముడు, కృష్ణుడు పాత్రలను తీసుకోవడం తప్పేమీ కాదు. అయితే కావాలని ఆ పాత్రలను ఇరికించకూడదు. మన జనరేషన్‌కు ఏదో ఒక విధంగా ఇతిహాసాలను దగ్గర చేయాలి. ఇందులో శ్రియ పాత్ర నేపథ్యాన్ని మరో కథలో వాడుదామనే ఉద్దేశంతోనే పూర్తిగా చెప్పలేదు. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా రియల్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేశాం. వీఎఫ్‌ఎక్స్‌ కోసం ఎక్కువ సమయం వెచ్చించాం. అన్ని విషయాలను అర్థం చేసుకుని నడుచుకునే నటీనటులు కుదిరారు. వ్యానిటీ వ్యాన్స్‌ లేకుండానే చాలా రోజులు షూట్‌ చేశారు’ అని చెప్పారు.

Updated Date - Sep 14 , 2025 | 07:20 PM