Tamannaah Bhatia: ఆ రూమర్స్ ఎలా వస్తాయో.. ఎందుకు క్రియేట్ చేస్తారో..
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:54 AM
తమన్నాపై (Tamannaah Bhatia)మరో రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్తానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను (Abdul Razzaq) ఆమె పెళ్లాడబోతోందని కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే!
తమన్నాపై (Tamannaah Bhatia)మరో రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్తానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను(Abdul Razzaq) ఆమె పెళ్లాడబోతోందని కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై తాజాగా బాలీవుడ్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్వూలో క్లారిటీ ఇచ్చారు మిల్కీబ్యూటీ. రూమర్స్‌ను ఖండించారు. ఈ గాసిప్ లకు సోషల్ మీడియా కారణమని చెప్పారు. అబ్దుల్‌తో కలిసి ఓ గోల్డ్ షాప్ ప్రారంభోత్సవానికి హాజరయ్యాను. అంతకు మించి అతనితో పరిచయం లేదు. ఈ రూమర్స్‌ను మీడియా ఎలా క్రియేట్ చేస్తుందో నాకైతే అర్థం కాదు. అది వాళ్లకి చాలా సులభం అనుకుంటా. ఇలాంటి వాటిని ప్రేక్షకులు కూడా ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. సెలబ్రిటీల జీవితాల గురించి బయటకు తెలిసేది కొంత వరకే! మా జీవితం ఏమీ పూల బాట కాదు. తెలియని వాటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇలా గాసిప్పులు క్రియేట్ చేస్తుంటారు’ అని మండిపడ్డారు.
అలాగే విరాట్ కోహ్లీతో రిలేషన్‌షిప్ లో ఉందంటూ వచ్చిన వార్తలపైనా ఆమె స్పందించారు. విరాట్‌ను కూడా ఒకసారే కలిశానని, ఆ సమయంలో ఇలాంటి ప్రచారం జరగడం బాధగా అనిపించిందని తమన్నా చెప్పారు. ఆ తర్వాత మళ్లీ కోహ్లీని కలవలేదన్నారు.
కొంతకాలంగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా.. ఇప్పుడు అతనికి బ్రేకప్ చెప్పింది. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇటీవల బాలీవుడ్‌లో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు విడివిడిగా హాజరయ్యారు. ఈ ఇద్దరూ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు ప్రేమకు గొప్ప గొప్ప నిర్వచనాలు ఇచ్చారు. ఏడాదిలోనే ఇద్దరికి బ్రేకప్ జరిగింది.