Pawan Kalyan: ఇండస్ట్రీలో అకీరా ఉండాలంటే.. అది తప్పనిసరి
ABN, Publish Date - Jul 21 , 2025 | 07:17 PM
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికీ చాలామంది హీరోలు వచ్చారు. నేపోటిజం ఎప్పుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి హెల్ప్ అవుతుందేమో కానీ, వారి సత్తానే వారిని హీరోగా నిలబెడుతుంది.
Pawan Kalyan: మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికీ చాలామంది హీరోలు వచ్చారు. నేపోటిజం ఎప్పుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి హెల్ప్ అవుతుందేమో కానీ, వారి సత్తానే వారిని హీరోగా నిలబెడుతుంది. ఈ విషయాన్నీ ప్రతి నేపో కిడ్ అర్ధం చేసుకున్నాకే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. మా నాన్న హీరో.. మా బాబాయ్ డైరెక్టర్.. మా మామ నిర్మాత.. ఇలాంటివన్నీ కేవలం ఇండస్ట్రీ లోపలి వెళ్ళడానికి జస్ట్ ఎంట్రీ పాస్ లాంటివి. అసలైన హీరోగా నిలబడాలి అంటే కథల ఎంపిక, టాలెంట్ అనేది తప్పనిసరి. ఇదే విషయాన్నీ తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చెప్పుకొచ్చాడు.
హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్.. నేపోటిజంపై స్పందించాడు. టాలెంట్ ఉంటే తప్ప ఇండస్ట్రీలో నిలబడలేరని, అది చివరకు తన కొడుకు అయినా సరే.. టాలెంట్ తప్పనిసరి అని చెప్పుకొచ్చాడు. ' ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా తీసుకోండి. ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కులమత బేధాలు ఉండవు. ఇక్కడ కేవలం క్రియేటివిటి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావొచ్చు, చిరంజీవి గారి కొడుకు కావొచ్చు, ఇంకొకరి మేనల్లుడు కావొచ్చు, ఇంకొకరి కొడుకు కావొచ్చు, నా కొడుకు కావొచ్చు.. అది విషయమే కాదు. నీకు టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేవు.. నీకు సత్తా లేకపోతే ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకు అయినా సరే. ఎంత కెపాసిటీ ఉంది. ఎంత సత్తా ఉంది.. ఎంత నిలబెట్టుకోగలవు.. ఎంత నిలదొక్కుకోగలవు ఇదే ఉంటుంది. ఇక్కడ ప్రతిభే ముఖ్యం' అంటూ చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు అంటే.. ఆయన ప్లేస్ ను రీప్లేస్ చేసే ఏకైక వ్యక్తి అకీరా నందన్ మాత్రమే అని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అందుకే అకీరా ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా.. ? అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పవన్ పక్కన ఆరడుగుల బులెట్ లా అకీరా నడుచుకుంటూ వస్తుంటే.. హీరో మెటీరియల్ లానే ఉన్నాడు. త్వరగా ఎంట్రీ ఇస్తే బావుండు అనుకున్నారు. రేణు దేశాయి సైతం కొడుకు ఆసక్తిని ఏనాడు కాదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అకీరా సంగీతంపై మక్కువ ఎక్కువ చూపిస్తున్నాడు. అంటే మ్యూజిక్ లో టాలెంట్ ఉంది కానీ, యాక్టింగ్ లో టాలెంట్ లేదు అని పవన్ హిట్ ఇస్తున్నాడా.. ? అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఉండదా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి అకీరా ముందు ముందు ఇండస్ట్రీలో ఎలాంటి ఎంట్రీ ఇస్తాడో చూడాలి.
SJ Suryah: ఏంటి సుధా.. ఇంకా సూర్యకు పెళ్లి కాలేదా
AM Rathnam: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నా..