SJ Suryah: ఏంటి సుధా.. ఇంకా సూర్యకు పెళ్లి కాలేదా

ABN , Publish Date - Jul 21 , 2025 | 06:44 PM

సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీల కుటుంబాల గురించి అందరికీ తెరిచిన పుస్తకంలా మారిపోయింది.

SJ Suryah

SJ Suryah: సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీల కుటుంబాల గురించి అందరికీ తెరిచిన పుస్తకంలా మారిపోయింది. ఆ హీరో భార్య ఈమె.. ఈ హీరోయిన్ భర్త అతను అంటూ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాయి. కానీ, కొంతమంది మాత్రం వారి ఫ్యామిలీ విషయాలను పర్సనల్ గా ఉంచుకుంటారు. అందులో కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు ఎస్ జె సూర్య (SJ Surya) ఒకరు. ఖుషి (Kushi) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను పవన్ కు అందించిన డైరెక్టర్ పులి సినిమాతో భారీ పరాజయాన్ని అందించాడు. ఇక ఇదంతా పక్కన పెడితే నటుడిగా సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.


ఇక తెలుగులో సూర్య నటనకు ఫిదా కానివారుండరు. ముఖ్యంగా సరిపోదా శనివారం సినిమాలో సుధా.. సుధా అంటూ నవ్విస్తూనే భయపెట్టిన విధానం కట్టిపడేస్తుంది. సూర్య సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన పెళ్లి గురించి వచ్చిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. ఇంకా ఎస్ జె సూర్యకు పెళ్లి అవ్వలేదట. 57 ఏళ్ల వయస్సులో ఉన్న సూర్య ఇంకా పెళ్లి చేసుకొనే ఆలోచన కూడా లేదని చెప్పుకురావడం విశేషం.


ఏంటి.. నిజంగా ఇప్పటివరకు సూర్య పెళ్లి చేసుకోలేదా.. ఆయనకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నామనుకున్నామే అని అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే సూర్య పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఉందట. పెద్ద హీరో అవ్వాలని కలలు కంటూ సూర్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నటుడిగా కంటే ముందు డైరెక్టర్ గా మారాడు. సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే నెమ్మదిగా యాక్టింగ్ వైపుకు వచ్చేశాడు. ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా.. సినిమాల విషయంలో లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని, ఇప్పటికీ తన లక్ష్యం కోసమే పరిగెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలియడంతో సూర్య బ్రో.. ఇక పెళ్లి వద్దులే.. ఇలాగే ఉండు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jul 21 , 2025 | 06:44 PM