Pawan Kalyan: అల్లు కుటుంబాన్ని పరామర్శించిన పవన్‌కల్యాణ్‌..

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:40 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan KalyaN) అల్లు అరవింద్‌ (Allu Aravind) కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Pawan Kalyan - Allu Family


ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan KalyaN) అల్లు అరవింద్‌ (Allu Aravind) కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం దివంగత అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్‌ మాతృమూర్తి అల్లు కనకరత్నం (Allu Kanakaratnam) మరణించిన సంగతి తెలిసిందే! కొంతకాలంగా వృధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. నిన్న సాయంత్రం కోకాపేటలో అంత్యక్రియలు జరిగాయి.

Pawan-kalyan.jpg

పవన్‌ కల్యాణ్‌ వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ‘సేనతో సేనాని’ సభతో బిజీ కావడం వల్ల శనివారం జరిగిన అంత్యక్రియలు కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు. ఆదివారం ఉదయాన్నే పవన్‌ అల్లు అరవింద్‌ ఇంటికి చేరుకుని కనకరత్నమ్మకు నివాళి అర్పించారు. అరవింద్‌, బన్నీలతో కాసేపు మాట్లాడారు. శనివారం కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ పవన్‌ భార్య అన్నా లెజినవా అక్కడే ఉన్న సంగతి తెలిసిందే! 

READ ALSO: Janhvi Kapoor: అప్పుడు ‘అతిలోక సుందరి’.. ఇప్పుడు  ‘పరమ్‌ సుందరి’

Tollywood: సినీ కార్మికుల వేతనాల పెంపు.. ఛాంబర్‌ ఆదేశాలు జారీ

Naruvi: ఆ గ్రామంలో పురుషులే ఎందుకు చనిపోతారు



Updated Date - Aug 31 , 2025 | 03:51 PM