Naruvi: ఆ గ్రామంలో పురుషులే ఎందుకు చనిపోతారు
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:16 AM
నీలగిరి జిల్లా కున్నూరుకు సమీపంలోని ఓ గ్రామంలో కేవలం పురుషులు మాత్రమే చనిపోతుంటారు. అలా ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి...
నీలగిరి జిల్లా కున్నూరుకు సమీపంలోని ఓ గ్రామంలో కేవలం పురుషులు మాత్రమే చనిపోతుంటారు? అలా ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి... అనే కథాంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని నిర్మించిన చిత్రం ‘నరువి (Naruvi) డాక్టర్ హరీష్ హీరోగా నటించారు. వీజే పప్పు, కేథరిన్, పడిన కుమార్ తదితరులు నటించారు. ఎం.సుభారక్ (Subharak) దర్శకత్వం వహించగా, నిర్మాత ఏ.అళగు పాండియన్ నిర్మించారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు వివరిస్తూ, ‘కున్నూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక కుగ్రామంలో కేవలం పురుషులు మాత్రమే అంతుచిక్కని రీతిలో చనిపోతుంటారు. ఈ మరణాల్లోని రహస్యాన్ని తెలుసుకునేందుకు ఇద్దరు యువకులు, ముగ్గురు అమ్మాయిల బృందం ఆ గ్రామానికి వెళుతుంది. అక్కడకు చేరుకున్న తర్వాత గ్రామంలో ఏం కనుగొన్నారన్నదే చిత్ర కథ. పైగా ఈ బృందంలో ఒక యువతి మామ కూడా అదే గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అదృశ్యమైపోతాడు. అతనికి ఏం జరిగిందో వారు అన్వేషిస్తారు. ఇందులో డాక్టర్ హరీష్ హీరోగా అద్భుతంగా నటించారు. సరైన రవాణా సౌకర్యాలు లేని, కొండ గ్రామానికి వెళ్లడం, అక్కడ చిన్నారులకు విద్యాబోధన చేసే పాత్రలో ఇమిడిపోయారు. ఈ చిత్రంలోని హీరోయిన్లలో ఒకరైన విన్సు పాత్ర గ్లామర్‌గా ఉంటుంది. అయితే, సినిమా క్లైమాక్స్‌తో ఆమె తీసుకునే నిర్ణయం దిగ్భ్రాంతికిలోనుచేస్తుంది. మదన్ ఎస్ రాజా టీ ఎస్టేట్ యజమానిగా, మృదువైన విలన్ పాత్రధారిగా నటించారు. ఇందులోని పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని, నేపథ్య సంగీతం కూడా చిత్రానికి అదనపు బలం. ఆధ్యాత్మిక అంశాలతో థ్రిల్లింగ్ హార్రర్ మూవీగా తెరకెక్కించామని, ఒక మంచి సందేశాన్ని అందించే మూవీగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.